Advertisement

చినబాబుని గొట్టిపాటి గెలిపిస్తాడంట!

Sat 10th Sep 2016 08:11 PM
china babu,nara lokesh,gottipati ravikumar,tdp,cabinet  చినబాబుని గొట్టిపాటి గెలిపిస్తాడంట!
చినబాబుని గొట్టిపాటి గెలిపిస్తాడంట!
Advertisement

ఇప్పటి వరకు చినబాబుగా తెదేపాలో తెరవెనుక రాజకీయాలు నడిపిన నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? అంటే అవుననే అంటున్నాయి తెదేపా వర్గాలు. అందుకు అనుగుణంగా తెదేపాలో చాలా చురుకుగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏదో ఒక నియోజకవర్గం నుండి చినబాబును పోటీ చేసి గెలిపించి రాష్ట్ర క్యాబినెట్ లోకి తీసుకొనేందుకు తెదేపా తీవ్రంగా సన్నాహాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అందుకు తాజాగా గొట్టిపాటి రవికుమార్ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పటివరకు తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శిగా లోకేష్ సేవ చేసిన విషయం తెలిసిందే. కాగా లోకేష్ కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించి ఆ తరువాత క్యాబినెట్ లోకి తీసుకోవాలనే వాదన మొన్నటివరకు వినిపించింది.  ఇదే విషయంపై చంద్రబాబు కూడా గతంలో వ్యాఖ్యలు చేశాడు. తెదేపాలో లోకేష్ చాలా చురుకైన కార్యకర్త అని అటువంటి వ్యక్తిని క్యాబినెట్ లోకి తీసుకుంటే బాగుంటుందని కూడా వ్యాఖ్యానించడం విశేషం.

కాగా తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం వైకాపా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత తెదేపాలోకి వెళ్ళిన గొట్టిపాటి రవికుమార్ దీనిపై స్పందించడంతో ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్ లో చేరాలని అన్నాడు. ఆ ప్రకారం లోకేష్ ను ఎమ్మెల్యేగా అద్దంకి నుండి పోటీ చేయాలని ఆయన కోరాడు. లోకేష్ ఒప్పుకుంటే తాను అద్దంకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చాడు గొట్టిపాటి. ఇంకా తాను లోకేష్ ను అద్దంకి నుండి భారీ మెజారిటీతో గెలిపించుకుంటానని కూడా వెల్లడించాడు. లోకేష్ అద్దంకి ఎమ్మెల్యే అయ్యి క్యాబినెట్ లోకి వెళ్తే అద్దంకితో పాటు ప్రకాశం జిల్లా మొత్తం అభివృద్ధి చెందుతుందని గొట్టిపాటి ఆకాంక్షను తెలిపాడు. ఒకవేళ ఇదే నిజమైతే తెదేపా రాబోవు ఎన్నికల కోసం ఇప్పటినుండే కసరత్తులు ముమ్మరంగా చేస్తుందని కూడా తెలుస్తుంది. ప్రకాశంజిల్లాలో తెదేపాకు వైకాపా బలమైన పోటీ కావడంతో లోకేష్ ను ప్రవేశ పెడితే అక్కడ అన్ని నియోజక వర్గాల ప్రజలను ఆకర్షించి ఈసారి ఎన్నికల్లో ప్రకాశం జిల్లా మొత్తాన్ని తెదేపా ఊడ్చేసేందుకు మార్గం అవుతుందని జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement