తాప్సీకి టాలీవుడ్ అంటే ఎంత ప్రేమో..!

Sat 10th Sep 2016 07:14 PM
tapsee,tollywood,tollywood chances,pink movie,bollywood  తాప్సీకి టాలీవుడ్ అంటే ఎంత ప్రేమో..!
తాప్సీకి టాలీవుడ్ అంటే ఎంత ప్రేమో..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ నుండి బాలీవుడ్ లోకి వెళ్ళిన సొట్టబుగ్గల చిన్నది తాప్సీ. బాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా అవకాశాలు వస్తున్నా తన మనస్సు మాత్రం టాలీవుడ్ చుట్టూతే తిరుగుతుందట. టాలీవుడ్ లో హీరోయిన్స్ కి ఉన్న గిరాకీ, ఇక్క‌డ నిర్మాతలు ఇస్తున్న పారితోషికాలు మొత్తం తాప్సీని బాగా ఆకర్షించాయనే చెప్పవచ్చు.  అందుకే తాప్సీ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తెలుగు సినిమాల్లో  మంచి అవ‌కాశాలొస్తే ఏమాత్రం వదులుకోనని, తప్పకుండా న‌టిస్తాన‌ని ఎప్ప‌టిక‌ప్పుడు సంకేతాలు ఇస్తూనే ఉంది. పాపం ఆమె  ఎంతలా వాపోతున్నా ప‌ల‌క‌రించేవాళ్లే క‌రువ‌యినట్లు తెలుస్తుంది. ఈ మధ్య కూడా హైదరాబాద్ వచ్చిన తాప్సి 'నేను తెలుగు సినిమాలు చేయ‌డానికి ఎప్పుడైనా రెడీగానే ఉన్నాను. కానీ ఇక్క‌డ నాకు సరైన అవ‌కాశాలు మాత్రం రావ‌డం లేదు క‌దా' అంటూ తెగ బాధపడుతూ మాట్లాడింది. ఆమె మాట‌ల్ని చూడబోతే, ఆమె తెలుగు సినిమాలు చేయడానికి ఎంతలా ఆవేదన పడుతుందో అర్థ‌మౌతుంది. ఈ సమయంలో తాప్సీకి తెలుగు సినిమా నుండి ఏ కొంచం ఆఫర్ వచ్చినా, ఎంత బిజీలో ఉన్నా ఆ అవకాశాన్ని ఏమాత్రం వదులుకొనేందుకు సిద్ధంగా లేనని చెప్పకనే చెప్పింది ఈ సొట్టబుగ్గల నారి.  

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ