Advertisement

ప్రత్యేక హోదాపై తారలు స్పందించరా?

Sat 10th Sep 2016 06:08 PM
special status,kaveri,andhra pradesh,karnataka,celebrities,cine stars,chiranjeevi,pawan kalyan,dasari  ప్రత్యేక హోదాపై తారలు స్పందించరా?
ప్రత్యేక హోదాపై తారలు స్పందించరా?
Advertisement

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇంకా సాంకేతిక నిపుణుల్లో చాలా మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. రాష్ట్ర విభజన జరిగినపుడు, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం వీరెవరూ నోరు విప్పుతున్న దాఖలాలు లేవు. తమ ప్రాంతానికి ప్రత్యేక హోదా కావాలని ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. తెదేపా మినహా అన్ని పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సినీ ప్రముఖులు స్పందించడం లేదు. తెలుగు సినిమాకు అత్యధిక కలెక్షన్లు ఆంధ్ర ప్రాంతం నుండే వస్తాయి. కొందరికి కుల పోరాటం మీద ఉన్న ఆసక్తి రాష్ట్రం మీద లేదని స్పష్టమవుతోంది. స్టార్‌ హీరో పవన్‌ కల్యాన్‌ బహిరంగంగా హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కానీ ఆయన అన్నగారు చిరంజీవి మాత్రం అటు పార్లమెంట్‌లో, ఇటు ప్రజల్లో నోరు విప్పడం లేదనే విమర్శలున్నాయి. కుల సమీకరణలు చేస్తున్న దాసరి వంటి పెద్ద సైతం సైలెంట్‌గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది చెందితేనే ఉద్యోగాలు వస్తాయి. అప్పుడే బి.సి.లకు రిజర్వేషన్లు అమలవుతాయి. కాపులను బి.సి.ల్లో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్న చిరంజీవి, దాసరికి ఇది గుర్తుకురాకపోవడం గమనార్హం. 

టాలీవుడ్‌ ఇలా శాండిల్‌వుడ్‌ అలా !!

పొరుగునే ఉన్న కర్నాటక రాష్ట్రంలో కావేరి జలాలపై ప్రజలు ఉద్యమిస్తున్న సందర్భంలో అక్కడి సినీ తారలంతా కదిలివచ్చారు. మద్దతుగా నిలిచారు. నిరసన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. శివరాజ్‌కుమార్‌, ఉపేంద్ర, దేవరాజ్‌, సీనియర్‌ నటీమణులు భారత, బి..సరోజ ఇంకా నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించే విషయంలో శాండిల్‌వుడ్‌ మొత్తం కదలడం చూసి మన టాలీవుడ్‌లో అయినా కదలిక వస్తుందని ఆశించడం అత్యాశకాదేమో.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement