తమన్నా తప్పుకుందా... తప్పించారా?

Wed 07th Sep 2016 07:33 PM
tamanna,mega star 150th movie,item song,catherine tresa,tamanna out in chiranjeevi movie  తమన్నా తప్పుకుందా... తప్పించారా?
తమన్నా తప్పుకుందా... తప్పించారా?
Sponsored links

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెం 150' చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. కాగా ఇందులోని ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం తమన్నాని ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. గతంలో చిరు కూడా తనకు తమన్నాతో డ్యాన్స్‌ చేయాలనే కోరికను వెల్లిబుచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తమన్నాను తప్పించి ఆ పాటకు 'సరైనోడు'లో యువ ఎమ్మెల్యేగా నటించిన కేధరిన్‌ను తీసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. అసలు ఈ సినిమా నుండి తమన్నా తప్పుకొందా?లేక ఆమెను తప్పించారా? అనే విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. చిరు పక్కన ఆయనకు ధీటుగా డ్యాన్స్‌ చేయగలిగిన సత్తా ఇప్పుడున్న యంగ్‌ హీరోయిన్లలో కేవలం తమన్నాకే ఉందని అందరూ ఒప్పుకొంటారు. మరి తమన్నాను ఈ స్పెషల్‌ సాంగ్‌ నుంచి ఎందుకు తప్పించారనే దానిపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019