పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తనకు సినిమాలు చేయడం ఇష్టంలేదని, కేవలం డబ్బుల కోసమే చిత్రాలు చేస్తున్నానని చెబుతూవుంటాడు. అది నిజమైనా కాకపోయినా ఆయన ఎప్పుడు సినిమాలు చేస్తోడో? ఎప్పుడు రాజకీయాలపై మొగ్గు చూపుతాడో తెలియని కన్‌ఫ్యూజన్ లో ఆయన అభిమానులు సైతం తలలు పట్టుకుంటున్నారు. అయినా కూడా ఆయనతో చిత్రాలు చేయాలని భావిస్తున్న నిర్మాతలు, దర్శకుల తాపత్రయం మాత్రం ఆగడం లేదు. కేవలం పవన్ డేట్స్ ఇస్తే చాలు.. ఆ తర్వాత సంగతి తర్వాత అలోచించవచ్చని అంటున్నారు. కాగా త్వరలో ఆయన డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు', త్రివిక్రమ్- రాధాకృష్ణల చిత్రం, దాసరి తారకప్రభు బేనర్‌లో దాసరి నిర్మాతగా ఒక చిత్రం, బాలాజీ సిని మీడియా బేనర్‌లో భగవాన్, పుల్లారావుల చిత్రం, ఎ.యం, రత్నం నిర్మాతగా ఓ చిత్రం.. ఇలా వరుసపెట్టి ఆయన కోసం క్యూ కడుతున్నారు. పవన్ ఎప్పుడంటే అప్పుడు చిత్రాలు ప్రారంభించడానికీ ఈ నిర్మాతలంతా సిద్దమవుతున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో సినిమాలు పక్కనపెట్టి రాజకీయాల వైపు టర్న్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నా, రాజకీయమా? సినిమాలా? అనే మీమాంసలో నలిగిపోతున్నప్పటికీ ఆయన నిర్మాతలు మాత్రం పవన్ తమకు ఓకే అంటే చాలంటూ పవన్ కోసం పడిగాపులు కాస్తున్నారు.




Loading..