Advertisementt

ఎన్టీఆరే పార్టీ ఇస్తున్నాడంట..!

Sun 04th Sep 2016 03:18 PM
jr ntr,party,janatha garage success,movie unit  ఎన్టీఆరే పార్టీ ఇస్తున్నాడంట..!
ఎన్టీఆరే పార్టీ ఇస్తున్నాడంట..!
Advertisement
Ads by CJ

'జనతా గ్యారేజ్' సెప్టెంబర్ 1 న విడుదలై మిశ్రమ స్పందన వచ్చినా థియేటర్లలో మాత్రం దూసుకుపోతుంది. ఈ సినిమా కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.  ఇక 'జనతా గ్యారేజ్' హిట్ తో ఎన్టీఆర్ కూడా మంచి ఖుషీగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమా మొదటిరోజు 20 కోట్ల వరకు వసూలు చేసి రెండో రోజు కూడా బాగానే రాబట్టిందని సమాచారం. సెప్టెంబర్ 2 న భారత్ బంద్ అన్నప్పటికీ ఈ చిత్రం పై ఆ ఛాయలేమి పడలేదని చెబుతున్నారు చిత్ర యూనిట్. ఇక ఓవెర్సెస్ లో మొదటిరోజు దాదాపు 5 కోట్ల వరకు వచ్చిందని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. టాక్ ఎలా వున్నా..4 రోజులు సెలవలు కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చాయి. టికెట్స్ ముందే బుక్ అవ్వడం వల్ల కలక్షన్స్ కి డోకా లేదని... ఈ 4 రోజుల్లోనే 50 కోట్లు 'జనతా గ్యారేజ్' తన అకౌంట్ లో వేసుకుంటుందని  ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఇక్కడ దర్శకుడు శివ ఇంకా చిత్ర నిర్మాతలు అయితే సినిమా విడుదల అయినా రెండో రోజే సక్సెస్ మీట్ పెట్టేసారు. ఎన్టీఆర్ సినిమా హిట్ ని ఎంజాయ్ చేస్తూ.. ప్రొడ్యూసర్స్ కి, బయ్యర్లకి, డైరెక్టర్ శివ కి స్పెషల్ గా పార్టీ ఏర్పాటు చెయ్యాలని చూస్తున్నాడట. అయితే అప్పుడే ఎన్టీఆర్ వీరందరికి ఫోన్ చేసి పార్టీ గురించి మాట్లాడడం కూడా జరిగిందని దానికి వారు కూడా ఒకే చేశారని సమాచారం. అయితే ఈ పార్టీ ఈ శనివారం గాని ఆదివారం గాని ఉండొచ్చని అంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ