Advertisementt

ఎన్టీఆర్‌ తో విసిగిపోయి..బన్నీ చెంతకు..!

Fri 02nd Sep 2016 09:05 PM
ntr,vakkantham vamsi,allu arjun,race gurram,temper,kick,vakkantham vamsi movie with allu arjun  ఎన్టీఆర్‌ తో విసిగిపోయి..బన్నీ చెంతకు..!
ఎన్టీఆర్‌ తో విసిగిపోయి..బన్నీ చెంతకు..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో 'కిక్‌, రేసుగుర్రం, టెంపర్‌' వంటి చిత్రాలతో స్టార్‌ రైటర్‌గా వెలుగొందుతున్న రచయిత వక్కంతం వంశీ. కాగా ఎప్పటినుండో ఈయన దర్శకునిగా పరిచయం కావాలని వెయిట్‌ చేస్తున్నాడు. ఎన్టీఆర్‌తో చేసే చిత్రంతో ఈ రచయిత దర్శకునిగా తెరంగేట్రం చేయాలని ప్లాన్‌ చేశాడు. కాగా త్వరలో ఎన్టీఆర్‌ హీరోగా, నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా చేయనున్న చిత్రం ద్వారా వక్కంతం వంశీ దర్శకునిగా పరిచయం కానున్నాడని, ఈ చిత్రానికి 'ధడ్కన్‌' అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్‌ మాత్రం ఉన్నట్లుండి వక్కంతం వంశీ చిత్రాన్ని పక్కనపెట్టాడనే టాక్‌ వినిపిస్తోంది. ఈమధ్య జరిగిన 'జనతాగ్యారేజ్‌' ప్రమోషన్‌ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, మరో చిత్రం చేయడానికి కొంత కాలం గ్యాప్‌ తీసుకోనున్నానని, వంశీ సినిమా ఇంకా ఖరారు కాలేదన్నట్లుగా మాట్లాడాడు. ఇప్పటికే రెండేళ్ల నుండి ఎన్టీఆర్‌ మీద నమ్మకంతో ఆయన తనకు మొదటి చాన్స్‌ ఇస్తాడని ఎదురుచూస్తూ, మిగిలిన హీరోల నుండి పలు ఆఫర్లు వస్తున్నా వాటిని వద్దని చెబుతూ వస్తున్న వక్కంతం వంశీ తాజాగా ఎన్టీఆర్‌ క్యాంపు నుండి బయటకు వెళ్లి అల్లుఅర్జున్‌కు ఓ కథ వినిపించాడని సమాచారం. ఈ లైన్‌ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండటంతో బన్నీతో వక్కంతం వంశీ సినిమా కన్‌ఫర్మ్‌ అయిందంటున్నారు. అయితే బన్నీకి చెప్పిన కథ ఎన్టీఆర్‌ కోసం తయారుచేసుకున్న సబ్జెక్టా? లేక ఫ్రెష్‌ సబ్జెక్టా అనేది మాత్రం తెలియరావడం లేదు. అయినా ఇప్పుడు బన్నీ ఉన్న బిజిలో ఈ చిత్రం కూడా ఇప్పుడు పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో ఇప్పటికే ఎన్టీఆర్‌ కోసం రెండేళ్లు వృథా చేసిన వక్కంతం.. బన్నీ కోసం మరో ఒకటి రెండేళ్లు వెయిట్‌ చేస్తాడా? లేక మరో హీరోతో ముందుకెళ్తాడా అన్న విషయం తేలాల్సివుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ