బాహుబలి ని క్రిష్ కాపీ చేస్తున్నాడా..!

Fri 02nd Sep 2016 03:20 PM
bahubali,gautamiputra satakarni,rajamatha,sivagaami,director krish  బాహుబలి ని క్రిష్ కాపీ చేస్తున్నాడా..!
బాహుబలి ని క్రిష్ కాపీ చేస్తున్నాడా..!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బాలకృష్ణ 100 వ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో బాలకృష్ణ కి తల్లిగా హేమమాలిని నటిస్తుండగా భార్యగా శ్రియా శరణ్ నటిస్తుంది. షూటింగ్ లో భాగంగా హేమమాలిని కి సంబంధించి... ఇంకా శ్రియా - బాలకృష్ణకి  సంబంధించి కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు క్రిష్. దానికి సంబందించిన  కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తున్నాయి. దీనిలో రాజమాతగా హేమమాలిని ఉండగా బాలయ్య భార్యగా శ్రీయ కనిపిస్తుంది. ఇక రాజు గెటప్ లో బాలకృష్ణ కనిపిస్తున్నాడు. అయితే వీరి వెనుక ఒక కోటను డైరెక్టర్ క్రిష్ చాలా నేచురల్ గా చూపించాడు. అంటే సినిమాలో కూడా ఇలానే చూపిస్తాడా లేక గ్రాఫిక్స్ తో మొత్తం మార్చేస్తాడా అనేది సినిమా విడుదల వరకు వేచి చూడక తప్పదు. అయితే ఇక్కడ కొంతమంది హేమమాలిని గెటప్ ని 'బాహుబలి'లో రాజమాత గా చేసిన రమ్యకృష్ణ.. శివగామి గెటప్ లా ఉందని కామెంట్ చేస్తున్నారు. అచ్చుగుద్దినట్లు రాజమాతల గెటప్స్ ఒకేలా ఉన్నాయని అంటున్నారు. మరి క్రిష్ అలా ఎలా  డిజైన్ చేసాడు. అంటే రాజమౌళిని క్రిష్ కాపీ కొడుతున్నాడా?.... లేక బాహుబలిని మించి గౌతమిపుత్రని తెరకెక్కించాలని చూస్తున్నాడా? అనేది తెలియాల్సి వుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ