Advertisementt

మహేష్ ది పక్కా ద్విబాషా చిత్రమట..!

Wed 31st Aug 2016 07:04 PM
mahesh babu,murugadoss,mahesh movie in telugu and tamil,murugadoss about mahesh  మహేష్ ది పక్కా ద్విబాషా చిత్రమట..!
మహేష్ ది పక్కా ద్విబాషా చిత్రమట..!
Advertisement
Ads by CJ

సౌతిండియాతో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి ప్రత్యేకత ఉన్న దర్శకుడు మురుగదాస్‌ ప్రస్తుతం ఎన్వీప్రసాద్‌, ఠాగూర్‌ మధులు నిర్మాతలుగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌తో చేస్తున్న చిత్రం షూటింగ్‌ బిజీగా జరుగుతోంది. కాగా ఈ చిత్రం దాదాపు 100కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈచిత్రం ఏదో పేరుకు ద్విభాషా చిత్రంగా చేయడం కాదని, ఈ చిత్రాన్ని రెండు భాషల్లోనూ వేర్వేరు ఆర్టిస్ట్‌లు యాక్ట్‌ చేస్తున్నారని మురుగదాస్‌ స్పష్టం చేశాడు. డబ్బింగ్‌ మాత్రం రెండు భాషల్లో కలిపి చేసి దాన్ని ద్విభాషా చిత్రంగా చెప్పుకోవడం కాదని, ఇది నూటికి నూరు శాతం ద్విభాషా చిత్రమేనని మురుగదాస్‌ స్పష్టం చేశాడు. ఇక ఈ చిత్రంలో మహేష్‌ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది. కాగా మహేష్‌బాబుతో తాను పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని మురుగదాస్‌ తెలిపారు. ఓ సోషల్‌ మేసేజ్‌ ఆధారంగా ఈ కొత్త చిత్రం రూపొందుతోందని సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ