Advertisement

తూచ్..ఓటుకు నోటు కేసు మళ్ళీ విచారించాలె!

Tue 30th Aug 2016 05:36 PM
ysrcp,tdp,cash for vote,chandrababu naidu,telangana government,ysr congress andhra pradesh  తూచ్..ఓటుకు నోటు కేసు మళ్ళీ విచారించాలె!
తూచ్..ఓటుకు నోటు కేసు మళ్ళీ విచారించాలె!
Advertisement

తెలుగుదేశం పార్టీ కోటరీని ఓ కుదిపు కుదిపిన ఓటుకి నోటు కేసు మళ్ళీ తిరగబడుతుంది. గతంలో తెలంగాణలో ముడిపడి పలుగురిని కుదిపేసిన ఆ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే ఏసిబి కోర్టులో వేసిన ఓ పిటిషన్ ద్వారా తిరిగి కేసు తిరగతోడ బడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసిబి కోర్టులో పిటిషన్ వేయడంతో ఈ కేసు మళ్ళీ విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణా నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఫోన్లో మాట్లాడినట్లు ఫోరెన్సిక్ నివేదిక కూడా పేర్కొన్నది కాబట్టి ఆయనని కూడా నిందితుడుగా చేర్చి మళ్ళీ మొదటి నుంచి పునర్విచారణ చేయాలని కోరుతూ రామకృష్ణారెడ్డి తెలంగాణా ఏసిబి కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. కాగా ఏసిబి న్యాయస్థానం ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపింది. విచారణలో భాగంగా తేల్చిన విషయం ఏంటంటే ఈ కేసుపై వచ్చేనెల 29వ తేదీలోగా సమగ్ర దర్యాప్తును పూర్తి చేసి నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఏసిబి అధికారులను ఆదేశించింది.

కాగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఈ కేసుకు సంబంధించిన తుది నిర్ణయం అంతా ఉందన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో మాదిరిగా ఈదఫా కూడా తెలంగాణా ప్రభుత్వం ఆ కేసుని త్రొక్కి పెడుతుందా..? లేక అలా తత్సారం చేస్తుందా..? లేక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందా..? వేచి చూడాలి.  ఏమాత్రం ఈ కేసుకు సంబంధించి నైతికపరమైన దర్యాప్తు జరిగితే, ఆ ప్రభావం తెదేపాపై పడితే, తెదేపా రెండు రాష్ట్రాలలోనూ కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే కదా మరి వైకాపా వాళ్ళు కేసును తిరగతోడుతుంది. ఏదో లోగుట్టు ఉండే ఉంటుంది. ఏమీ లేకపోతే అందరూ మర్చిపోయిన కేసును మళ్ళీ కదిలించుకోవడం ఏంటి... చూద్దాం ఏం జరుగుతుందో?   

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement