Advertisementt

జెసి..తిడతాడు అంతలోనే పొగుడుతాడు!

Mon 29th Aug 2016 09:03 PM
jc diwakar reddy,chandrababu,scs,pawan kalyan,janasena,andhra pradesh  జెసి..తిడతాడు అంతలోనే పొగుడుతాడు!
జెసి..తిడతాడు అంతలోనే పొగుడుతాడు!
Advertisement
Ads by CJ

జెసి దివాకర్ రెడ్డి అంటే తెలియని వారు వుండరు. అయన అనంతపురం రాజకీయాల్లో కీలకమైన, వెరైటీ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్న వ్యక్త్తి. ఆయన రాష్ట్రం విడగొట్టబడిన తర్వాత కాంగ్రెస్ నుండి టిడిపిలో కి జంప్ అయ్యారు. టిడిపి నుండి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యాడు. అయితే ఈయన అప్పుడప్పుడు చంద్రబాబుని విమర్శిస్తూనే మరి కాసేపట్లో పొగిడేస్తూ ఉంటాడు. ఈయనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దొరుకుతుందని ఆఖరి నిమిషం వరకు కాచుకు కూర్చున్నాడు. కానీ అది సాధ్యపడలేదు.... అదిగో అప్పటినుండి కొంచెం చంద్రబాబు మీద గుర్రుగానే వున్నాడు. ఏం చేస్తాడు పాపం తెలుగు దేశం లో ఉండి పార్టీ అధినాయకుడి మీద డైరెక్ట్ గా ఎటాక్ చెయ్యలేడు కదా... అందుకే కొంచెం విమర్శించి విమర్శించనట్టు కనబడతాడు. ఇప్పుడూ అదే జరిగింది. పవన్ కళ్యాణ్ తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రసంగం లో పవన్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా టిడిపి మీద పంచ్ లు వేశాడు. మన ఎంపీలు చాల డబ్బులున్నోళ్లని వారిని చూసి మోడీ గారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన దివాకర్ రెడ్డి గారు  పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు. అతనికి రాజకీయం గురించి తెలియదని అంటున్నాడు. ఇంకా ..ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బిజెపి నుండి బయటికి వచ్చేద్దామని చంద్రబాబు కి ఎప్పుడో చెప్పానంటున్నాడు. హోదా వస్తుంది అంటే ఎంపీలంతా రాజీనామా చెయ్యడానికి సిద్హంగా వున్నారని చెబుతున్నాడు దివాకర్ రెడ్డి. మరి జెసి ఇచ్చిన ఈ సలహాని చంద్రబాబు గారు పట్టించుకోక పోవడం వల్లే ఏపీ కి ప్రత్యేక హోదా రాలేదని అంటున్నాడనేగా దానర్ధం. ఇలాగే విమర్శిస్తాడు మళ్లీ అంతలోనే పొగడ్తలతో ముంచేస్తాడు.....అది జెసి నైజం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ