Advertisement

గోపిచంద్ ను ప్రశంసించిన మోడి, సచిన్.....!

Sun 28th Aug 2016 09:31 PM
modi,sachin,indian olympics winners,gopichand,pv sindhu,bmw car presentation  గోపిచంద్ ను ప్రశంసించిన మోడి, సచిన్.....!
గోపిచంద్ ను ప్రశంసించిన మోడి, సచిన్.....!
Advertisement

భారత ప్రధాని నరేంద్ర మోడి, బ్మాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. గోపిచంద్ ఉత్తమ ఉపాధ్యాయుడు, ఒక మంచి టీచర్ ఏం చేయగలడో ఆయన ప్రయోగాత్మకంగా చేసి చూపించాడని వివరించాడు. గోపిచంద్ అకాడమీలో శిక్షణ తీసుకొన్న పీవీ సింధూ ఒలింపిక్స్ లో రజత పతకాన్ని సాధించి దేశ ప్రతిష్ఠను దేదీప్యమానం చేసిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా మోడీ మాట్లాడారు. గోపిచంద్ ను ఓ క్రీడాకారుడి కంటే టీచర్ గా గుర్తిస్తేనే మంచిదన్నట్లు మోడీ అభిప్రాయపడ్డాడు. ఇంకా ఒలింపిక్స్ లో ఇండియన్ డాటర్స్ గొప్ప విజయాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టారన్నాడు. పీవీ సింధూతో పాటు సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ తోపాటు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఇతర క్రీడాకారులను మోడీ అభినందనలు తెలిపాడు.

అలాగే భారత క్రికెటెర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆదివారం ఉదయం 9 గంటలకు గోపిచంద్‌ అకాడమీకి చేరుకొని ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన వారిని హృదయపూర్వకంగా అభినందించాడు. పీవీ సింధు, సాక్షిమాలిక్‌, దీపా కర్మాకర్‌ లకు ఆయన చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కార్లను బహుకరించాడు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడైన కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ 'రియల్‌ హీరో' అంటూ సచిన్ ప్రశంసించాడు. ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన ఆటగాళ్లను అభినందించాడు. కాగా వీరితో పాటు కోచ్‌ గోపిచంద్‌కు కూడా బీఎండబ్ల్యూ కారును సచిన్‌ బహుకరించాడు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement