ఈసారి డాన్స్ కూడా చేశాడంట!

Sat 27th Aug 2016 06:07 PM
vijay devarakonda,pelli choopulu,dwaraka,dance,yevade subramanyam  ఈసారి డాన్స్ కూడా చేశాడంట!
ఈసారి డాన్స్ కూడా చేశాడంట!
Sponsored links

చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కేకపెట్టించిన 'పెళ్ళిచూపులు' చిత్రంలో నటించిన నటీనటులకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో హీరోగా వైవిధ్యభరితమైన, రియలిస్టిక్‌ నటనతో విజయ్‌ దేవరకొండ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ హీరో చేతిలో ప్రస్తుతం మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి 'ద్వారక'. తన మొదటి రెండు చిత్రాలలోనూ పెద్దగా డ్యాన్స్‌ చేసే అవకాశం, స్టెప్పులతో ఇరగదీసే అవసరం ఈ హీరోకు రాలేదు. కానీ 'ద్వారకా' చిత్రంలో మాత్రం ఈ హీరోలోని మరో యాంగిల్‌ అయిన డ్యాన్స్‌లు ఇరగదీశాడంటున్నాయి యూనిట్‌ వర్గాలు. మొత్తానికి ఈ మూడో చిత్రం ద్వారా విజయ్‌ దేవరకొండ తనలోని సరికొత్త టాలెంట్‌ను ప్రేక్షకులకు రుచి చూపించేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ డ్యాన్స్‌లు ఆయనకు ఎంతగా కలిసొస్తాయో? అయనలోని మరో టాలెంట్‌ను ఎంతవరకు ఇవి బయటపెడుతాయో వేచిచూడాల్సివుంది. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019