Advertisementt

చిరు 151 కూడా లైన్లోకి వచ్చేసింది!

Fri 26th Aug 2016 08:23 PM
chiranjeevi,151 movie,mega star chiranjeevi,geetha arts,allu aravind,boyapati,puri jagan  చిరు 151 కూడా లైన్లోకి వచ్చేసింది!
చిరు 151 కూడా లైన్లోకి వచ్చేసింది!
Advertisement
Ads by CJ

దాదాపు దశాబ్దం తర్వాత మరలా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న 150వ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 'ఖైదీనెం 150' టైటిల్‌తో రూపొందుతున్న ఈచిత్రం తమిళ 'కత్తి'కి రీమేక్‌గా.. వినాయక్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ తనయుడు రామ్ చరణ్‌ తమ కొణదెల బేనర్‌లో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఓవైపు 150వ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండగానే చిరు ఆ తదుపరి నటించనున్న 151వ చిత్ర కథాచర్చలు కూడా మొదలయ్యాయని సమాచారం. ప్రస్తుతం నటిస్తున్న 150వ చిత్రంలాగానే తన తదుపరి 151వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా మెగా బేనర్‌ అయిన గీతాఆర్ట్స్‌ పతాకంపై అల్లుఅరవింద్‌ నిర్మించనున్నాడని విశ్వసనీయ సమాచారం. కాగా ఈచిత్రానికి బోయపాటి లేదా పూరీజగన్నాథ్‌లలో ఒకరికి ఈచిత్ర దర్శకత్వ బాధ్యతలను అప్పగించే విషయంలో చర్చలు జరుగుతుండటం ప్రస్తుతం టీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ