Advertisementt

ఈ డైరెక్టర్ తో సునీల్‌ సినిమానా..!

Thu 25th Aug 2016 02:20 PM
telangana shankar,sunil,two countries,sunil in malayalam remake,shankar with sunil  ఈ డైరెక్టర్ తో సునీల్‌ సినిమానా..!
ఈ డైరెక్టర్ తో సునీల్‌ సినిమానా..!
Advertisement
Ads by CJ

ఇటీవల కమెడియన్‌ నుండి హీరోగా మారిన సునీల్‌ సినిమాలేవీ సరైన హిట్ కావడం లేదు. ఆయన నటించిన 'పూలరంగడు', 'మర్యాద రామన్న' తర్వాత సునీల్ కు ఇప్పటివరకు మరో హిట్‌ లేదు. దాంతో సునీల్‌ కెరీర్‌ చాలా ఇబ్బందుల్లో పడింది. అర్జంట్‌గా ఆయనకు ఓ హిట్‌ పడాల్సివుంది. ప్రస్తుతం సునీల్ ఆశలన్నీ ఇప్పుడు వీరుపోట్లతో చేస్తున్న 'ఈడు గోల్డ్‌ ఎహే'తో పాటు.. క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో నటించే చిత్రాల పైనే వున్నాయి. కాగా త్వరలో సునీల్‌ ఓ మలయాళం రీమేక్‌లో నటించనున్నాడనే వార్తలు వస్తున్నాయి. మలయాళంలో అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సూపర్‌హిట్‌ అయిన 'టూ కంట్రీస్‌' రీమేక్‌లో సునీల్‌ హీరోగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ చిత్రం తెలుగు రీమేక్‌ రైట్స్‌ను బండ్ల గణేష్‌ చేజిక్కించుకుంటున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఈ చిత్రం తెలుగు రీమేక్‌ రైట్స్‌ను దర్శకుడు ఎన్‌.శంకర్‌ 2కోట్ల ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నాడని తెలుస్తోంది. ఆయన దర్శకత్వంలోనే ఈ 'టూ కంట్రీస్‌' రీమేక్‌ తెరకెక్కనుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో హీరోగా సునీల్‌ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంచి చిత్రాలను తీస్తాడనే పేరున్నప్పటికీ ఎన్‌.శంకర్‌ ఇటీవలి కాలంలో లైమ్‌లైట్‌లో లేడు. మరో పక్క సునీల్‌ పరిస్ధితి కూడా అలానే ఉంది. మరి ఈచిత్రం వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొంది ఇద్దరికీ లైఫ్‌ని ఇస్తుందా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికర విషయం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ