నయీమ్ ఖాతా లో.. సినీ పెద్దలు..!

Mon 22nd Aug 2016 09:53 PM
nayim,cine producers,tollywood,c kalyan,bandla ganesh,natti kumar,nayim attachments  నయీమ్ ఖాతా లో.. సినీ పెద్దలు..!
నయీమ్ ఖాతా లో.. సినీ పెద్దలు..!
Advertisement
Ads by CJ

నయీమ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్. పోలీసుల నుండి పొలిటిషన్స్ వరకు అందరూ నయీమ్ కునుసన్నల్లో పని చేసిన వారే అని వార్తలొస్తున్న వేళ ఇపుడు మరో కోణం బయటపడింది. అదే నయీమ్ కి టాలీవుడ్ ఇండస్ట్రీతో సంబంధాలు వున్నాయనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని నట్టి కుమార్ మీడియాకి ప్రెస్ మీట్ పెట్టి మరీ బయటపెట్టాడు. నయీమ్ కి టాలీవుడ్ నిర్మాతలతో సంబందాలు ఉన్నాయని... వారి వల్ల నేను చాల నష్టపోయానని చెప్పాడు. ఏపీలో థియేటర్స్ లో కాంటీన్ వ్యాపారాలన్నీ నయీమ్ ఆధ్వర్యంలోనే నడిచేవని చెప్పుకొచ్చాడు. అదంతా ఒక దందాలా జరిగేదని చెప్పాడు. తన థియేటర్ ని కూడా వాళ్ళు లాక్కున్నారని చెప్పుకొచ్చాడు. అయితే టాలీవుడ్ నిర్మాతలు సి.కళ్యాణ్, బండ్ల గణేష్, సచిన్ జోషీ, అశోక్ కుమారులతో నయీమ్ కి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని... ఇంకా ఈ లిస్టులో చాలామందే వున్నారని చెప్పాడు. తనకు నయీమ్ గ్యాంగ్ వల్ల చాలా ఇబ్బందులు కలిగాయని..... వీటి గురుంచి ఇప్పుడు ఏపీలో మంత్రిగా చెలామణి అవుతున్న అచ్చెన్నాయుడితో చెప్పానని అయన సరిగా స్పందించలేదని చెప్పుకొచ్చాడు. ఇంకా అచ్చెన్నాయుడికి శ్రీకాకుళం పోలీస్ లందరూ చుట్టాలే అని అందుకే పోలీస్ లకు ఈ విషయాలు చెప్పినా పట్టించుకోలేదని సంచలనాత్మకం గా మాట్లాడాడు. అయితే నయీమ్ చనిపోయాడు ప్రాబ్లెమ్ లేదు అనుకుంటున్నారేమో అయన అనుచరులు ఇంకా బ్రతికే వున్నారని చెప్పాడు. వారి వల్ల కూడా ప్రొబ్లెమ్స్ వస్తాయని చెప్పుకొచ్చాడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ