Advertisementt

సెన్సార్‌కు రెడీ అవుతోన్న యంగ్‌టైగర్‌ మూవీ...!

Mon 22nd Aug 2016 05:51 PM
jr ntr,janatha garage movie,sencor,september 2nd release,mohanlal,koratala siva  సెన్సార్‌కు రెడీ అవుతోన్న యంగ్‌టైగర్‌ మూవీ...!
సెన్సార్‌కు రెడీ అవుతోన్న యంగ్‌టైగర్‌ మూవీ...!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌, సమంత, నిత్యామీనన్‌లతో మైత్రి మూవీ మేకర్స్‌ సంస్ద నిర్మిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్‌' సెప్టెంబర్‌ 2వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉంది. ఈ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసి ఆగష్టు 27న సెన్సార్‌కు వెళ్లాలని టీమ్‌ భావిస్తోంది. మరో పక్క ఈ చిత్రం మలయాళ వెర్షన్‌పై కూడా దృష్టిపెడుతున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఆడియో, ట్రైలర్స్‌తో ఈ చిత్రం భారీ అంచనాలను పెంచింది. ఇక ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ఇదే వారంలో ప్రారంభించడానికి యూనిట్‌ సిద్దం అవుతోంది. ఈ చిత్రం ఓ మంచి సందేశంతో రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ చిత్రంతో కొరటాల, ఎన్టీఆర్‌లు హ్యాట్రిక్‌ కొడతారా? మలయాళంలో కూడా ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుంది.? మైత్రి మూవీస్‌ ద్వితీయ విఘ్నాన్ని అధిగమిస్తుందా? లేదా? అనేవి వేచిచూడాలి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ