Advertisementt



రష్మి- సుధీర్ ల మధ్య అలాంటిదేం లేదండహో....!

Sun 21st Aug 2016 03:07 PM
rashmi goetham,sudigali sudheer,love affair,getup sreenu,clarity,face book live  రష్మి- సుధీర్ ల మధ్య అలాంటిదేం లేదండహో....!
రష్మి- సుధీర్ ల మధ్య అలాంటిదేం లేదండహో....!
Advertisement
Ads by CJ

ఇంటర్నెట్ కు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది. అంతర్జాలాన్ని ఉపయోగించడమే తెలియాలి గానీ దాంతో అద్భుతాలు చేయవచ్చు. విజయాలు సాధించవచ్చు. సామాజిక అనుసంధాన మాధ్యమాలైన ఫేస్ బుక్ లు, వాట్సఫ్ లాంటి వాటి ద్వారా ప్రజలతో ఎలాంటి వారైనా, ఎక్కడి నుంచైనా కంప్యూటర్ తోనైనా, ఫోన్ తోనైనా ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. అంతటి అవకాశం నేడు సాంకేతికత అభివృద్ధిలో భాగంగా అందిన వరం. తాజాగా జబర్దస్త్ టీం సభ్యులైన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఇద్దరూ కలిసి సరదాగా అభిమానులతో ముచ్చటించడానికి మొదటిసారిగా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చారు. ఈ పరిచయ కార్యక్రమం వేదికగా చేసుకొని ఇద్దరూ కొన్ని పచ్చి నిజాలను అన్నట్లుగా కొన్ని రహస్యాలను వెల్లడించారు.

అభిమానులంతా ఒక్కసారిగా హాయ్... హాయ్... అంటూ పలుకరిస్తుంటే.... వాటన్నింటికీ స్పందించారు. జబర్దస్త్ కార్యక్రమం లేకపోతే మీరిద్దరూ ఏం చేసి ఉండేవాళ్ళు అంటే గెటప్ శ్రీను వంట, సుడిగాలి సుధీర్ మ్యాజిక్ తో గడిపేవాళ్ళం అన్నారు. కాగా ఆ తర్వాత ఓ అభిమాని.... రష్మీ, సుధీర్ ల లవ్ ఎఫైర్ ఎంతవరకు వచ్చిందన్నట్లుగా ప్రస్తావించినప్పుడు... గెటప్ శ్రీను కలుగజేసుకొని వారిద్దరీ మధ్య ఎలాంటి ఎఫైర్ నడవడం లేదని, స్కిట్స్ లలో  టైమింగ్ పంచుల కోసం అలాంటి విషయాలను వాడుకుంటామే తప్ప అదేం లేదని వివరించాడు. ప్రేక్షకులను ఆనందింపజేయడం కోసం కాసేపు అలా సరదాగా మాట్లాడతామే తప్ప రష్మి, సుధీర్ ల మధ్య ఎటువంటి ప్రేమ విషయాలు లేవని వెల్లడించాడు గెటప్ శ్రీను. అంటే ప్రేక్షకుల ఆనందమే రష్మీ, సుధీర్ ల ఆనందమట. వీక్షకులను ఆనందింపజేయడానికి ఎటువంటి ఎఫైర్ లైనా సృష్టించవచ్చునన్నమాట.

కాగా చాలా కాలం నుండి యాంకర్ రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ నడుస్తుందన్న వార్త మీడియాల్లోనే పలుసార్లు షికార్లు చేసింది.  వాళ్లిద్దరూ లవ్ లో మునిగి తేలుతున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇంకా ఇది అభిమానుల్లో ఇంతలా నాటుక పోవడానికి ఇద్దరూ కలిసి రెండుమూడు ప్రోగ్రామ్స్ లలో పనిచేస్తుండటం కూడా ఒక కారణం. అన్నట్టు మర్చాను. అప్పట్లో రష్మీ, సుధీర్ లిప్ లాక్ ఫోటోస్ కూడా యూ ట్యూబ్ లో హల్ చల్ చేశాయి కదా మరి. దీనికేం అందువు తిరుమలేశా.....!    

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ