Advertisementt

దేవిశ్రీకి ఉన్న కమిట్‌మెంట్‌ అది...!

Sat 20th Aug 2016 06:09 PM
devi sri prasad,commitment,music director,usa music show,helping nature  దేవిశ్రీకి ఉన్న కమిట్‌మెంట్‌ అది...!
దేవిశ్రీకి ఉన్న కమిట్‌మెంట్‌ అది...!
Advertisement
Ads by CJ

చాలా చిన్నస్థాయి నుండి వచ్చి మంచి స్దానాన్ని సంపాదించుకున్న వారిలో సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్‌ ముందు వరుసలో ఉంటాడు. తన సంగీతంతో, అంతులేని ఎనర్జీతో, హుషారెక్కించే డిఎస్పీకి సామాజిక బాధ్యత కూడా ఎక్కువే. గతంలో కూడా ఆయన తాను ఎన్నో గుప్తదానాలు చేసినప్పటికీ వాటిని పబ్లిసిటీ చేసుకోలేదు. కాగా ఇటీవల ఈ సంగీత సంచలనం యూఎస్‌ వెళ్లి అక్కడ కొన్ని మ్యూజికల్‌షోలు, టీవీ ప్రోగ్రామ్‌లు చేశాడు. దాంతో వచ్చిన డబ్బును ఆయన కంటిచూపు సరిగాలేని చిన్నారుల ఆపరేషన్లకు అందజేశాడు. ఇలా సినీరంగంలోని ప్రముఖుల్లో పెరుగుతున్న సామాజిక బాధ్యతకు ఉదాహరణగా దేవిశ్రీని చెప్పుకోవాలి. దేవిశ్రీ చేసిన పని చూసి పరిశ్రమలోని అందరూ దేవిశ్రీని ప్రశంసలతో ఆకాశానికెత్తేస్తున్నారు. మొత్తానికి దేవిశ్రీలాగే ఇతరులు కూడా ఇలాంటి కార్యక్రమానికి ముందుకు వస్తే... అది అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ