Advertisement

పాక్ కౌంటర్ ని.. మోడి భలే తిప్పికొట్టాడు!

Mon 15th Aug 2016 09:49 PM
pakistan,india,narendra modi,baluchistan,independence day,modi counter on pakistan  పాక్ కౌంటర్ ని.. మోడి భలే తిప్పికొట్టాడు!
పాక్ కౌంటర్ ని.. మోడి భలే తిప్పికొట్టాడు!
Advertisement

పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో భాగమే అంటూ తరచూ అంతర్జాతీయ వేదికలపై సైతం మోడీ ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. అందుకు పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా పాకిస్తాన్ అధ్యక్షుడు ముమ్మూన్ హుస్సేన్ మాట్లాడుతూ కాశ్మీర్ ప్రజల స్వాతంత్య్రానికి సంపూర్ణ మద్దతునిస్తున్నాం అన్నట్లు భారత్ ను రెచ్చగొట్టే విధంగా పలికాడు. దీంతో భారత ప్రధాని పీఠం ఎక్కినప్పటి నుండి పలు వేదికలపై పదే పదే పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయాన్ని ప్రస్తావిస్తున్న మోడికి కళ్ళెం వేసినట్లుగానే భావించవచ్చు. ఇంకా పాక్ అధ్యక్షుడు మాట్లాడుతూ కాశ్మీర్ ప్రజల కష్టాలు మట్టిపాలు కావని, త్వరలోనే కాశ్మీర్ లో కొనసాగుతున్న అల్లర్లు తగ్గిపోవాలని కూాడా భావిస్తున్నట్లు వెల్లడించాడు. 

పాకిస్తాన్ అధ్యక్షుడు ముమ్మూన్ హుస్సేన్ తూటాల వంటి మాటలపై భారత ప్రధాని నరేంద్ర మోడి గట్టిగానే స్పందించాడు. భారత 70 వ స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నరేంద్ర మోడి కాశ్మీర్ విషయంలో భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు. అదేంటంటే పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ కు స్వాతంత్య్రం రావాలని మోడి భావిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ వార్త బలూచిస్తానీయులకు సంతోషాన్నిచ్చింది. అంతేకాదు పాక్ లో అంతర్భాగంగా ఉన్న బలూచిస్తాన్ కు చెందిన ఓ రాజకీయ నాయకుడు జైహింద్ అంటూ స్పందించాడు కూడాను. బలూచిస్తాన్ లోని ఓ రాజకీయ పార్టీ అయిన బలూచ్ రిపబ్లికన్ పార్టీ నాయకుడు ఆష్రఫ్ షెర్జాన్ జైహింద్ అనడమే కాకుండా పాక్ కబంధ హస్తాల నుండి బలూచిస్తాన్ ప్రజలు స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నారని స్పందించాడు. ఇంకా బలూచిస్తాన్ ప్రజలు త్వరలోనే బారత్ తో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుందని, బలూచిస్తాన్ గురించి అంతర్జాతీయ స్థాయి వేడుకల్లో సైతం మాట్లాడుతున్న మోడీకి కృతజ్ఞతలు అని కూడా వెల్లడించాడు. దీంతో పాక్ కౌంటర్ ను బారత్ ఎన్ కౌంటర్ చేసినట్లుగానే భావించవచ్చు. కాగా మోడీ ఈ విషయం వెల్లడించిన కొద్దిసేపటికే కాశ్మీర్ లో ఉగ్రవాదులు తెగపడ్డారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement