Advertisementt

కృష్ణ పుష్కరాలు: టీవీ నటికి ప్రమాదం!

Mon 15th Aug 2016 07:03 PM
tv artist,rohini reddy,accident,vijayawada,krishna pushkaralu  కృష్ణ పుష్కరాలు: టీవీ నటికి ప్రమాదం!
కృష్ణ పుష్కరాలు: టీవీ నటికి ప్రమాదం!
Advertisement
Ads by CJ

కృష్ణ పుష్కర స్నానానికి వెళ్తూ..ప్రమాదానికి గురై..ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది..బుల్లితెరపై గలగల మాట్లాడే రోహిణి రెడ్డి. పలు సీరియల్స్‌లో నటిస్తూ.. ఎప్పుడూ గల గల మాట్లాడుతూ..అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండే రోహిణి చాలా మందికి పరిచయస్తురాలే. ఈ నటి పుష్కర స్నానానికని విజయవాడ వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైంది. పుష్కరుని దయ వల్ల ప్రాణాపాయం అయితే జరగలేదు కానీ.. తీవ్ర గాయాలు మాత్రం అయినట్లుగా తెలుస్తుంది. వివరాల్లోకి వస్తే..పుష్కర స్నానం కోసం హైద్రాబాద్‌ నుండి విజయవాడ వెళ్తున్న రోహిణి రెడ్డి కారుని విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఓ లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రోహిణితో పాటు డ్రైవర్‌ ఉషప్ప గౌడ్‌, అసిస్టెంట్‌ చంటి లు కూడా తీవ్ర గాయాలకు లోనయ్యారు. ఈ ప్రమాదం చూసిన స్థానికులు వెంటనే వారిని గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పటల్‌కి తరలించడంతో..ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి గురైన కారు నుజ్జునుజ్జు అయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి వీరు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నట్లుగా సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ