Advertisementt

దుల్కర్ తో ఎఫైర్ పై నిత్యా స్పందన!

Sat 13th Aug 2016 05:25 PM
dulquer salmaan,nithya menen,affair between dulquer salmaan and nithya menen,nithya menen about her affair  దుల్కర్ తో ఎఫైర్ పై నిత్యా స్పందన!
దుల్కర్ తో ఎఫైర్ పై నిత్యా స్పందన!
Advertisement
Ads by CJ

మలయాళ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్  మధ్య కొంత కాలంగా ఎఫైర్ నడుస్తుందంటూ మలయాళ మీడియా కోడైకూస్తుంది. ఇద్దరూ కలిసి మూడు, నాలుగు మలయాళం సినిమాల్లో నటించారు. ఆ యా సినిమాల్లో ఆన్ స్క్రీన్ పై మంచి కెమిస్ట్రీ పండించడంతో అంతలా వారి మధ్య కెమిస్ట్రీ కుదరటానికి కారణం లేకపోలేదంటూ ఇద్దరిపై మీడియా పదే పదే కథనాలు ప్రచారం చేయడం మొదలెట్టింది. 

నిత్యా ఎప్పుడూ కూడా గాసిప్ వార్తలను అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాగా దుల్కర్ పెళ్ళయిన కుర్రాడు కావడంతో, భార్యా భర్తల మధ్య వివాదాలకు తావు ఇవ్వకుండా నిత్యా స్పందించింది. ఈ విషయంపై వస్తున్న రూమర్స్ ను అదుపు చేసేందుకు నిత్యామీనన్ రంగంలోకి దిగి..మా ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు, అయినా పెళ్లయిన వాళ్ళతో నేను ఎపైర్ పెట్టుకోవడం ఏంటి? దుల్కర్ కాపురంలో చిచ్చుపెట్టడానికే ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారా?.. అంటూ మండిపడింది నిత్యామీనన్. ఇద్దరూ కలిసి రెండు మూడు చిత్రాల్లో నటించి మంచి కెమిస్ట్రీని పండిస్తే అంతలోనే ప్రేమ వ్యవహారం అంటూ ప్రచారం చేసేస్తారా అంటూ వెల్లడించిందీ నిత్యామీనన్.   

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ