Advertisement

మహేష్‌ను నమ్ముకుంటే చాలా...!

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకి ఎంత క్రేజ్‌ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇక దర్శకనిర్మాతలకు కూడా ఆయన్ను నమ్ముకుంటే మంచే జరుగుతుందని, ఆయన రిపీట్‌ కాంబినేషన్స్‌ చేయడం ద్వారా దర్శకనిర్మాతలకు అవకాశాలు బాగానే ఇస్తుంటాడని అంటుంటారు. సినిమా హిట్టయినా, ఫ్లాప్‌ అయినా ఆయన చేసిన నిర్మాణ సంస్థలకు, దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. నిర్మాతల విషయంలో ఆయన అశ్వనీదత్‌, 14 రీల్స్‌ వంటి సంస్ధలకు రెండు మూడు అవకాశాలు ఇచ్చాడు. ఇక తాజాగా ఆయన 'బ్రహ్మోత్సవం' తీసిన పివిపి సంస్దకు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు కన్‌ఫర్మ్‌ చేశాడు. ఇక దర్శకులుగా కూడా ఆయన గుణశేఖర్‌, శ్రీనువైట్ల, శ్రీకాంత్‌ అడ్డాల, పూరీ, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వంటి దర్శకులతో మహేష్ రెండుమూడు చిత్రాలు చేశాడు. త్వరలో మరలా పూరీ దర్శకత్వంలో ఓ చిత్రం, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో మరో చిత్రం చేయడానికి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఇలా తనకు గుర్తింపునిచ్చిన దర్శకులను వదలకుండా.. తన మంచి మనసును చాటుకుంటూ వస్తున్నాడు. ఇక వంశీపైడిపల్లి కూడా ఆయనను మెప్పిస్తే మరిన్ని అవకాశాలు ఖాయమని, ఇక వంశీపైడిపల్లి గ్రాఫ్‌ పెరిగిపోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

prince mahesh babu
vamsi paidipally
mahesh babu movies
mahesh babu directors