మెగా డాటర్‌కు ప్లస్, మైనస్‌ కూడా ఇదే!

Thu 11th Aug 2016 06:52 PM
oka manasu,niharika,niharika mega heroine,mega daughter niharika,vijay devarakonda  మెగా డాటర్‌కు ప్లస్, మైనస్‌ కూడా ఇదే!
మెగా డాటర్‌కు ప్లస్, మైనస్‌ కూడా ఇదే!
Sponsored links

మెగాఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెగాబ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక 'ఒక మనసు' చిత్రంలో నటించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఆమె మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్‌ కావడంతో ఆమెకు అదే ప్లస్‌ అదే మైనస్‌గా మారింది. ఇతర హీరోయిన్ల మాదిరిగా ఆమె ఏ చిత్రాలంటే ఆ చిత్రాలు చేస్తే ఒప్పుకోలేని పరిస్దితి. నేటి హీరోయిన్ ల వలే గ్లామర్ షో లాంటివి నిహారిక చేస్తే..మెగా ఫ్యామిలీ నే కాదు ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు. ఇక తన మొదటి చిత్రంగా వచ్చిన 'ఒక మనసు' చిత్రం కు కూడా అనుకున్న స్దాయిలో ఆదరణ లభించలేదు. దాంతో ఈ భామ తన రెండో చిత్రంగా ఓ రీమేక్‌ చిత్రాన్ని ఒప్పుకుందని సమాచారం. ఇదో పంజాబీ థ్రిల్లర్‌ మూవీకి రీమేక్‌ అని సమాచారం. ఈ చిత్రం ద్వారా కార్తీక్‌ అనే కొత్తదర్శకుడు పరిచయం అవుతుండగా, 'పెళ్ళిచూపులు' చిత్రం ద్వారా పాపులర్‌ అయిన కొత్త కుర్రాడు విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. మరి ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాలను త్వరలో అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019