విక్రమ్‌కు ఈ..సెంటిమెంట్‌ కలిసోస్తుందా?

Tue 09th Aug 2016 04:51 PM
vikram,iru mugan,inkokkadu,vikram sentiment,tamil movie villain sentiment  విక్రమ్‌కు ఈ..సెంటిమెంట్‌ కలిసోస్తుందా?
విక్రమ్‌కు ఈ..సెంటిమెంట్‌ కలిసోస్తుందా?
Advertisement
Ads by CJ

తమిళనాట ఓ సెంటిమెంట్‌ చాలా మంది స్టార్స్‌కి కలిసొచ్చింది. దాంతో ప్రస్తుతం ఫ్లాప్‌లలో ఉన్న చియాన్‌ విక్రమ్‌ కూడా అదే సెంటిమెంట్‌ను నమ్ముకున్నాడు. అప్పటి వరకు కేవలం హీరోగానే సుపరిచితమైన తమిళస్టార్‌ అజిత్‌కు 'వాలి' చిత్రం స్టార్‌ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇందులో ఆయన హీరోగా, విలన్‌గా కూడా నటించాడు. ఇక రజనీకాంత్‌కి సైతం శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'రోబో' చిత్రం రికార్డులను తిరగరాసింది. ఇందులో ఆయనే హీరోగా, విలన్‌గా నటించాడు. విలన్‌ చిట్టి పాత్రలో రజనీ అద్బుతమైన మ్యాజిక్‌ చేశాడు. ఇక కమల్‌హాసన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటించిన 'దశావతారం' చిత్రంలో విలన్‌ పాత్రను కూడా కమలే చేసి అదరగొట్టాడు. తాజాగా వచ్చిన సూర్య '24' చిత్రం కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈచిత్రంలో హీరోగానే కాకుండా విలన్‌ ఆత్రేయగా నటించిన సూర్య అద్బుతమనిపించాడు. ఈ చిత్రం కూడా వరస అపజయాల్లో ఉన్న సూర్యకు మరలా పునర్జన్మనిచ్చింది. తాజాగా విక్రమ్‌ కూడా ప్రస్తుతం తాను చేస్తోన్న 'ఇరుముగన్‌' చిత్రంలో కూడా హీరోగా విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్‌గా హిజ్రా పాత్రను ఆయన చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో హిజ్రా విలన్‌ గెటప్‌లో ఉన్న విక్రమ్‌ చూపిస్తున్న హావభావాలకు అద్భుతమైన స్పందన వస్తోంది. కాగా సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయిన చిత్రాలలో 'వాలి' తప్ప అన్ని సినిమాలు సైన్స్‌ఫిక్షన్‌ చిత్రాలే కావడం విశేషం. మరి విక్రమ్‌కు ఈ సైన్స్‌ఫిక్షన్‌ సెంటిమెంట్‌ కలిసిరావాలని ఆశిద్దాం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ