Advertisementt


చైతూ, అఖిల్ కి ఒకేసారి కాదు..!

Tue 09th Aug 2016 01:07 PM
naga chaitanya,akhil,marriage,nagarjuna,samantha  చైతూ, అఖిల్ కి ఒకేసారి కాదు..!
చైతూ, అఖిల్ కి ఒకేసారి కాదు..!
Advertisement
Ads by CJ

నాగార్జున పెద్దకుమారుడు నాగ చైతన్య - సమంత ల పెళ్లి త్వరలో నే జరగబోతుందని ప్రచారం జరుగుతుంది. అలాగే చిన్న కొడుకు అఖిల్ పెళ్లి కూడా త్వరలోనే జరుగుతుందని అంటున్నారు. మరి నాగార్జున ఇద్దరి పెళ్లి ఒకేసారి చేయబోతున్నాడని ప్రచారం జరుగుతున్న వేళ.... ఒకేసారి ఇద్దరి పెళ్లిళ్లు జరిగితే బాగోదని నాగార్జున అనుకుంటున్నాడని సమాచారం. ఇద్దరికి ఒకేసారి ఎంగేజ్ మెంట్ చేసి వేరు వేరుగా పెళ్లిళ్లు చెయ్యాలని నాగార్జున భావిస్తున్నాడట. ఒకేసారి పెళ్లి జరిగితే అది కాస్తా హడావిడి అవుతుందని... అందుకే వేరువేరుగా చేయాలని భావిస్తున్నాడని సమాచారం. ఇంకా ఈ పెళ్లిళ్ల డేట్ ఫిక్స్ కాలేదు. అయితే నాగార్జున మాత్రం నేను వాళ్ళ ఇష్టాలను కాదనేవాడిని కాదని వాళ్ళ  నిర్ణయాల పట్ల సంతృప్తిగా వున్నానని... అందుకే వారి జీవితాల్లో జోక్యం చేసుకోదలుచుకోలేదని.. వాళ్ళు కోరినప్పుడు మాత్రం మంచి సలహాలు ఇస్తానని అంటున్నాడు. సో.. నాగ చైతన్య, అఖిల్ ల పెళ్లిభాజాలు త్వరలోనే మోగబోతున్నాయన్నమాట.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ