Advertisementt

అలీని తప్పించి సునీల్ ని పెట్టారా!

Sun 07th Aug 2016 08:28 PM
ali,sunil,mega 150,chiranjeevi,chalapati rao,annapurna  అలీని తప్పించి సునీల్ ని పెట్టారా!
అలీని తప్పించి సునీల్ ని పెట్టారా!
Advertisement
Ads by CJ

చిరంజీవి 150 వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.... ఈ సినిమాలో సునీల్ ఒక గెస్ట్ పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాకి సంబందించి మరో న్యూస్ బయటికి వచ్చింది. చిరు 150 వ సినిమాలో చిరంజీవి తండ్రిగా చలపతి రావు నటిస్తుండగా... తల్లిగా అన్నపూర్ణ నటిస్తుందనేది ఈ న్యూస్. ఇక వీళ్ళమీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. అయితే ఈ సినిమా కి సంబంధించి మరో న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అది వి.వి.వినాయక్ తీసే ఈ సినిమా రీ షూట్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ తో చిరంజీవి అసంతృప్తిగా ఉన్నాడని.... అలీతో తనతో తీసిన సన్నివేశాలలో కామెడీ అంత అనుకున్నట్టుగా లేదని అందుకే రీ షూట్ చెయ్యాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే అలీతో తీసిన సన్నివేశాలను మళ్ళీ సునీల్ తో రీషూట్ చెయ్యాలని చిరంజీవి అనుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ