Advertisementt

వారి నమ్మకం అనుష్క మీద లేక అశోకా.!?

Fri 05th Aug 2016 01:58 PM
anushka,bhagamati,prabhas,high budget,pilla jamindar ashok  వారి నమ్మకం అనుష్క మీద లేక అశోకా.!?
వారి నమ్మకం అనుష్క మీద లేక అశోకా.!?
Advertisement
Ads by CJ

అనుష్క ప్రధాన పాత్రలో పిల్ల జమీందారు ఫేమ్ అశోక్ డైరెక్షన్ లో 'భాగమతి' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనుష్క హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. అయితే 'భాగమతి' సినిమాని నిర్మాతలు భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నారని సమాచారం. నిర్మాతలు ఈ సినిమాకి 25 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని టాక్. ఈ మూవీ గురించి ఏ న్యూస్ వచ్చినా అది హాట్ టాపిక్ అవుతుంది. కారణం ఈ మూవీ ప్రభాస్ ఓన్ బ్యానర్ అయినటువంటి  ‘యువి క్రియేషన్స్’లో రూపుదిద్దుకోనుండటమే. ఈ సినిమా కోసం ఇప్పటికే ఓ భారీ మహల్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారని... ఈ సెట్ వెయ్యడానికే నిర్మాతలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఒక హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ఓ థ్రిల్లర్ మూవీకి ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం అంటే.. నిర్మాతల ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇది అనుష్క మీద నమ్మకమా లేక డైరెక్టర్ మీద నమ్మకమా అనేది వాళ్ళకే తెలియాలి. ఈ సినిమాని హై టెక్నిక్ వేల్యూస్ తో తెరకెక్కిస్తున్నామని డైరెక్టర్ అశోక్ చెబుతున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాడనే వార్తలు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేసున్నాయి. అలాగే ఈ సినిమాలో టబు, ఆది పినిశెట్టి కూడా ప్రధానమైన పాత్రల్లో నటిస్తున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ