సమంతా..ఇంత ప్రదర్శన అవసరమా..!

నాగచైతన్యతో  త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న సమంత ఈ మధ్య తన ఫ్రెండ్స్ తో ఒక జాలీ ట్రిప్ వేసిన విషయం తెలిసినదే. అయితే ఈ ట్రిప్ లో కొంత మంది టాలీవుడ్ హీరో హీరోయిన్స్ కూడా వున్నారు. వీరు కేవలం నాగ చైతన్య ఇచ్చిన బ్యాచిలర్ పార్టీ కి హాజరయ్యారని ప్రచారం జరిగింది. ఇంకో పక్క నాగ చైతన్యకి, సమంత కి ప్రైవసీ ఏర్పాటు చేయడానికే ఫ్రెండ్స్ ఇలా ప్లాన్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ పార్టీ కి సంబంధించి.. నాగ చైతన్య, సమంత ఇద్దరు కలిసి దిగిన ఒక్క పిక్ కూడా ఏ సోషల్ వెబ్సైటు లో కనబడలేదు సరికదా... అసలు వీరిద్దరూ కలిసే ఉన్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. అసలు సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రెజినా, నీరజ కోన హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారని అక్కడ వీళ్లకు రానా, రవితేజ, శిల్పా రెడ్డి కలిసారని... ఇక అందరూ కలిసి ఎంజాయ్ చేశారని వాళ్ళ పోస్ట్ చేసిన ఫొటోస్ ని బట్టి కొందరు చెబుతున్నారు. కానీ సమంత మాత్రం తన పెళ్లి సెటిల్ అయినందుకు గాను ఖుషీగా ఎంజాయ్ చెయ్యడానికే బెల్జియమ్ వెళ్లినట్లుంది. ఎందుకంటే సమంత వెళ్లిన దగ్గర నుండి హాట్ హాట్ అందాల ప్రదర్శన ఫొటోస్ పోస్ట్ చేస్తూ గడిపేస్తుంది. మొన్నామధ్య చిన్న గౌన్ వేసుకుని దర్శనమిచ్చిన సమంత ఇప్పుడు ఏకంగా చిన్న నిక్కరు, మినీ షార్ట్ వేసుకుని చాలా హాట్ గా తన ఫ్రెండ్స్ రెజీనా, నీరజ కోన, రకుల్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ పిక్స్ చూసినా వారంతా... నాగ చైతన్యతో పెళ్లికి సిద్ధమయ్యాక కూడా సమంత మరీ ఇంత అందాల ప్రదర్శన అవసరమా అంటున్నారు. ఈ పిక్ లో సమంతానే కాదు రెజీనా కూడారెచ్చిపోయి అందాలను ప్రదర్శింది. సినిమాలలో అందాల ప్రదర్శన అంటే ఒకే గాని.. మరీ ఇంత పబ్లిక్ గా అందాలను ఆరబొయ్యలా వీళ్ళు అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

samantha
exposing
naga chaitanya
samantha holiday trip with friends
Advertisement
Advertisement