Advertisementt

ప్రారంభం రోజే టైటిల్ చెప్తామంటున్నారు!

Wed 03rd Aug 2016 09:33 PM
sekhar kammula,varun tej,sai pallavi,aug 5,dil raju  ప్రారంభం రోజే టైటిల్ చెప్తామంటున్నారు!
ప్రారంభం రోజే టైటిల్ చెప్తామంటున్నారు!
Advertisement
Ads by CJ

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడిగా సాయి పల్లవి హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని ప్రారంభించడానికి ముహూర్తం కుదిరిందని సమాచారం. ఆగష్టు 5 న ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించి అదే రోజు టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారట. ఇప్పటి వరకు వరుణ్ చేసిన సినిమాలన్నీ విభిన్న కథాంశాలతో వచ్చినవే. ఇక శేఖర్ కమ్ములకు చక్కటి ఫ్యామిలీ కథా చిత్రాలు... స్వచ్ఛమైన లవ్ స్టోరీలు తీస్తాడనే పేరుంది. ఇప్పుడు వరుణ్ - శేఖర్ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా కూడా ఒక చక్కటి ప్రేమ కథా చిత్రంగా ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో వరుణ్ అమెరికా అబ్బాయిగా, సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిగా నటించనున్నారని సమాచారం. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ