Advertisementt

ఐటీ శాఖవారే మోసం చేశారు..!

Wed 03rd Aug 2016 02:11 PM
it department,income tax department,it informer,mumbai high court  ఐటీ శాఖవారే మోసం చేశారు..!
ఐటీ శాఖవారే మోసం చేశారు..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ పెద్దలుగా చెలామణి అవుతున్న బడాబాబుల దగ్గరనుండి ఆదాయపు పన్ను ఎలా వసూలు చెయ్యాలో ఐటి శాఖ వారికి బాగా తెలుసు. అయితే ఆదాయపు పన్ను శాఖ బడా బాబుల ఆస్తుల గురించి, ఆదాయం గురించి అన్ని విషయాలను బయట పెట్టడానికి ఒక ఐటీ ఇన్ఫార్మర్ ని నియమించుకుంది. అయితే ఈ ఇన్ఫార్మర్ గతం లో 1990 నుండి 2000 సంవత్సరం వరకు ఎంతో కష్టపడి ఏంతో సమాచారాన్ని సేకరించి ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాడు. వాళ్ళు ఇన్ఫార్మర్ ఇచ్చిన ఆధారాలతో బాలీవుడ్ నటులు రాణిముఖర్జీ, శేఖర్ సుమన్, బాలాజీ టెలీఫిలిం అధికారి బ్రదర్స్‌తో పాటు16 ఇతర పెద్ద సంస్థల ఆదాయాన్ని ఐటీ శాఖ వారు.. వారి నుండి పన్నుల రూపం లో రాబట్టింది. అయితే ఈ ఆధారాలన్నీ, ఇంతటి విలువైన సమాచారాన్ని సేకరించి తమకు ఇచ్చినందుకు గాను ఐటి శాఖా వారు ఆ ఇన్ఫార్మర్ కి 5 కోట్లు రివార్డును ఇస్తానని చెప్పారు. కాని ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆ 5 కోట్ల రివార్డును మాత్రం ఆ ఇన్ఫార్మర్ కి ఇవ్వలేదు ఐటి శాఖ. మరి వారికి 50 కోట్లకు పైగా లాభాన్ని తెచ్చిపెట్టిన ఇన్ఫార్మర్ కి 5 కోట్లు ఇవ్వడానికి ఐటి శాఖ ఎందుకు ఆలోచించిందో ఏమోగానీ అతను ఇప్పుడు కోర్టుకు వెళ్ళాడు. తన రివార్డు మనీ తనకి ఇప్పించాలని తనకి ఆ డబ్బే ఆధారమని పేర్కొన్నాడు. ఈ కేసును పరిశీలించిన ముంబై హై కోర్టు ఐటీ శాఖ వారిని మందలించి అతనికి ఇవ్వవలసిన 5 కోట్లు 6 నెలల్లో అందచేయాలని తీర్పు నిచ్చింది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ