Advertisement

ఇక బాలీవుడ్‌లో ఎక్స్‌ఫోజింగ్‌ని ఆపేదెవరు?!

Tue 02nd Aug 2016 08:01 PM
bollywood,mohenjo daro,hrithik and pooja hegde,liplock,censor board,supreme court  ఇక బాలీవుడ్‌లో ఎక్స్‌ఫోజింగ్‌ని ఆపేదెవరు?!
ఇక బాలీవుడ్‌లో ఎక్స్‌ఫోజింగ్‌ని ఆపేదెవరు?!
Advertisement

సినిమా అనే దానికి సెన్సార్‌ లేకపోతే.. ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి? అవును.. ఇప్పుడు అదే జరగబోతుంది బాలీవుడ్‌లో. దర్శకుడు మరో అవకాశం కోసం, నిర్మాత తన వ్యాపారం కోసం..ప్రేక్షకుడ్ని ఎలా థియేటర్‌కి రప్పించాలా అనే ఆలోచిస్తుంటారు. ఇలాంటి ఆలోచనలో నుండి పుట్టిందే ఎక్స్‌ఫోజింగ్‌. ఈ ఎక్స్‌ఫోజింగ్‌ టాలీవుడ్‌తో పోలిస్తే..బాలీవుడ్‌లో మోతాదు కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. దీన్ని కట్‌ చేయడానికే ఉన్న సెన్సార్‌లో ఈ మధ్య ఏం తెలియని వారు ఉండటం, నిర్మాతలు ఇచ్చే డబ్బుకు బాగా అలవాటు పడటం, ఇవ్వకపోతే సదరు సినిమాలకు విపరీతంగా కట్స్‌ విధించడం వంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా బాలీవుడ్‌లో 'ఉడ్తాపంజాబ్‌' విషయంలో ఇదే జరిగింది. అయితే ఆ సినిమా నిర్మాతలు సుప్రీం కోర్టుని ఆశ్రయించడంతో..సెన్సార్‌ బోర్డుకి అక్షింతలు బాగా పడ్డాయి. దీనితో బాలీవుడ్‌ సినిమాల విషయంలో సెన్సార్‌ ఇకపై ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు. దీనికి ఉదాహరణ హృతిక్‌రోషన్‌, పూజాహెగ్డేల మధ్య మొహంజదారో చిత్రంలో ఘాటు ఘాటు లిప్‌లాక్‌ సీన్లు 3 ఉన్నా..ఎక్కడ ఏ కట్‌ చెబితే..మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళుతుందో అని సింగిల్‌ కట్‌ లేకుండా ఈ సీన్స్‌ని సెన్సార్‌ బోర్డు ఓకే చేసిందట. ఇదే ఇప్పుడు బాలీవుడ్‌లో సంచలన వార్తగా మారింది. సెన్సార్‌ బోర్డు ఇచ్చిన ఈ లూజ్‌తో.. బాలీవుడ్‌లో ఎక్స్‌ఫోజింగ్‌ క్రేజ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ప్రత్యేకించి ఎక్స్‌ఫోజింగ్‌ కోసమే.. సినిమా చేసే స్టార్లు, నిర్మాతలు దీంతో మరింత రెచ్చిపోవడం ఖాయం అన్నట్లుగా బాలీవుడ్‌ గురించి టాక్‌ నడుస్తోంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement