Advertisementt

ఐఎండీబీ ర్యాంకింగ్స్‌లో మహేష్‌ సంచలనం!

Tue 02nd Aug 2016 04:49 PM
imdb,mahesh babu,9 movies,telugu movies,imdb top 250 movies  ఐఎండీబీ ర్యాంకింగ్స్‌లో మహేష్‌ సంచలనం!
ఐఎండీబీ ర్యాంకింగ్స్‌లో మహేష్‌ సంచలనం!
Advertisement
Ads by CJ

ఏంటి టైటిల్‌ చూసి..ఏ నారాయణనో, లేక శ్రీ చైతన్య కాలేజీలోనో రిజల్ట్స్‌ వచ్చాయి అనుకుంటున్నారా? అలాంటిదేలే కానీ..ఇది చదువుకు సంబంధించినది కాదు..సినిమాలకు సంబంధించినది. అమెజాన్‌కి చెందిన ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎండీబీ) వెబ్‌సైట్‌..ఇటీవల 250 ఇండియన్‌ సినిమాలకు రేటింగ్‌ ఇస్తే..అందులో టాప్‌ రేటెడ్‌గా 17 తెలుగు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఈ 17 సినిమాల్లో 9 సినిమాలు మహేష్‌బాబువే కావడం విశేషం. ఈ సైట్‌లో రిజిష్టర్‌ అయిన 67 మిలియన్ల మంది ముందు ఇండియన్‌ సినిమాలకు సంబంధించిన టాప్‌ 250 ర్యాంకింగ్స్‌ నిర్వహించగా..అందులో తెలుగు సినిమాలు కేవలం 17 మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఈ 17 సినిమాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అతడు (32), బొమ్మరిల్లు (61), బాహుబలి (68), ఒక్కడు (87), నేనొక్కడినే (103), పోకిరి (104), ఈగ (122), ఖలేజా (154), మగధీర (156), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (177), దూకుడు (181), శ్రీమంతుడు (184), ఆర్య2 (232), అత్తారింటికి దారేది (235), జల్సా (236), టెంపర్‌ (246), బిజినెస్‌మ్యాన్‌ (249). టాప్‌ 20లో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం చూస్తుంటే..ఈ ర్యాంకింగ్స్‌పై కొంచెం అనుమానించాల్సి వస్తుంది. అంటే ఈ సైట్‌లో ఎక్కువగా తెలుగు తెలియని వారే రిజిస్టర్‌ అయి ఉన్నారేమో అనిపిస్తుంది. అలాగే మహేష్‌బాబువే 9 సినిమాలంటే..ఇందులో రిజిష్టర్‌ అయిన వాళ్లు ఎక్కువగా మహేష్‌బాబు ఫ్యాన్స్‌ అయ్యి ఉండవచ్చు. అలాంటప్పుడు ఈ ర్యాంకింగ్స్‌ కరెక్ట్‌ అని మాత్రం అనలేం. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ