Advertisementt

ఎన్టీఆర్ డాన్స్ స్పీడ్ 4జి ని మించిపోయింది!

Mon 01st Aug 2016 06:20 PM
janatha garage,5g,johnny master,jr ntr,jr ntr dance  ఎన్టీఆర్ డాన్స్ స్పీడ్ 4జి ని మించిపోయింది!
ఎన్టీఆర్ డాన్స్ స్పీడ్ 4జి ని మించిపోయింది!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే డాన్స్ లకు పెట్టింది పేరు. అయన తన మొదటి సినిమా నుండే డాన్స్ విషయం లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'జనతా గ్యారేజ్' సినిమా కోసం ఎన్టీఆర్ చేస్తున్న డాన్స్ చూసి చిత్ర యూనిట్ ఫిదా అయిపోతుందట. ఈ మధ్య 'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్ చేసిన ఒక డాన్స్ వీడియో నెట్ లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో లో ఎన్టీఆర్ డాన్స్ ఎలా ఇరగదీశాడో అందరూ చూసారు. 'జనతా గ్యారేజ్' సినిమాకి దేవిశ్రీ  అందిస్తున్న సాంగ్స్ కి ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేస్తున్నాడని స్వయంగా డాన్స్ మాస్టర్ జానీ నే చెప్పడం విశేషం. డాన్స్ మాస్టర్ అలా మూవ్ మెంట్ చెప్పగానే ఇంకోసారి అడగకుండా వెంటనే పర్ఫెక్ట్ గా ఆ స్టెప్ వేసి చూపిస్తున్నాడట. ఎన్టీఆర్ డాన్స్ మూమెంట్స్, ఇంకా ఆ స్పీడ్ చూసి జానీ మాస్టర్ ఫిదా అయిపోయాడట. అంతే కాదు ఇక ఎన్టీఆర్ డాన్స్ స్పీడ్ కి 5 జి అంటూ ఒక మంచి పేరు కూడా పెట్టేసాడట. ఇప్పటికే రెండు సినిమాల హిట్స్ తో జోరుమీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు 3 వ సినిమా హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. విడుదలకు ముందే ఎన్నో విషయాల్లో సంచలనాలకు తెర తీసిన ఈ సినిమా డాన్స్ ల పరం గా కూడా మంచి క్రెడిట్ కొట్టెయ్యబోతుందన్నమాట. 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్ లు నటిస్తున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ