Advertisementt

ఏపీ ఎంపీలకు ప్రజలే బుద్దిచెప్పాలి..!

Fri 29th Jul 2016 04:27 PM
andhra pradesh,mplads,tdp  ఏపీ ఎంపీలకు ప్రజలే బుద్దిచెప్పాలి..!
ఏపీ ఎంపీలకు ప్రజలే బుద్దిచెప్పాలి..!
Advertisement
Ads by CJ

ఎంపీలకు అభివృద్ది పనుల కోసం కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్దిక నిధులైన ఎంపీల్యాడ్స్‌ మోడీ ప్రభుత్వం భారీగా పెంచింది. ఒక్కో ఏడాది ఎంపీలు చేయాల్సిన అభివృద్ది పనుల కోసం కేంద్ర రూ.5 కోట్లు ఇస్తోంది. కాగా ఏపీలోని పలువురు టిడిపి ఎంపీలు, కేంద్రమంత్రులకు కేటాయించిన ఈ రూ.5 కోట్లను వారు ఖర్చు చేయకపోతుండటంతో ఈ నిధులు మురిగిపోయే ప్రమాదం ఏర్పడింది. అభివృద్ది కార్యక్రమాలు చేపట్టే సమయం లేక, తమ వ్యక్తిగత లాభాలకోసం పాకులాడే ఎంపీలు, మంత్రులు ఎంపీల్యాడ్స్‌ నిధులను ఖర్చు చేయకపోవడం మన ఎంపీల దుస్దితిని కళ్లకు కట్టింది. అభివృద్ది పనులకు నిధులు చాలక కొన్నిరాష్ట్రాల ఎంపీలు అల్లాడుతుంటే, ఉన్న నిధులను ఖర్చుచేసే సమయం కూడా లేక మన ఎంపీలు తమ పనితీరుతో ప్రజలకు క్షమించరాని నేరం చేస్తున్నారు. దీనికి వచ్చే ఎన్నికల్లో ఏపీ ఎంపీలకు ప్రజలే బుద్దిచెబుతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ