Advertisementt

'అభినేత్రి'కి ఏమైంది..?

Thu 28th Jul 2016 08:26 PM
abhinetri,abhinetri title change,prabhu deva,tamanna,abhinetri movie updates  'అభినేత్రి'కి ఏమైంది..?
'అభినేత్రి'కి ఏమైంది..?
Advertisement
Ads by CJ

తమన్నా ప్రధానపాత్రలో ఇండియన్‌ మైఖేల్‌జాక్సన్‌ ప్రభుదేవా కీలకపాత్రలో నటిస్తూ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అభినేత్రి'. ఈ చిత్రాన్ని ఇదే టైటిల్‌తో ఫస్ట్ లుక్, ఆడియో, ట్రైలర్స్‌ అన్నీ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కోనవెంకట్‌ అందిస్తున్నాడు. ఈ టైటిల్‌కు మంచి రెస్పాన్సే వచ్చింది. అదే పేరుతో ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లింది. అయితే ఏమైందో తెలియదు కానీ..ఈ చిత్రం టైటిల్‌ను ఇప్పుడు తెలుగులో మార్చాలని భావిస్తున్నారట. 'అభినేత్రి'కి బదులు 'దేవి' అనే టైటిల్‌ పెట్టనున్నారని సమాచారం. మరి ఇందుకు దారి తీసిన కారణాలు ఏమిటో మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. కాగా ఈ చిత్రం విడుదల కూడా ఇప్పటికే బాగా లేటయిందని ప్రభుదేవా ఫీలవుతున్నాడట. వేడిలో ఉన్నప్పుడే ఈ చిత్రాన్ని విడుదల చేస్తే తమన్నా, ప్రభుదేవాల సహకారంతో అయినా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ