Advertisementt

అల్లు వారబ్బాయి ఆశగా చూస్తున్నాడు!

Thu 28th Jul 2016 03:23 PM
allu sirish,srirastu subhamastu,chiranjeevi  అల్లు వారబ్బాయి ఆశగా చూస్తున్నాడు!
అల్లు వారబ్బాయి ఆశగా చూస్తున్నాడు!
Advertisement
Ads by CJ

అల్లు అరవింద్‌ చిన్న తనయుడు అల్లు శిరీష్‌ 'గౌరవం' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత చేసిన 'కొత్తజంట' కూడా ఆయనకు అనుకున్న విజయాన్ని అందించలేకపోయింది. దీంతో ఈసారి 'శ్రీరస్తు...శుభమస్తు' చిత్రం ద్వారా ఎలాగైనా హిట్‌ కొట్టాలని ఈ హీరో ఆశపడుతున్నాడు. అల్లు అర్జున్‌ వరుస విజయాల నుంచి స్పూర్తి పొందానని చెబుతున్న శిరీష్‌ తాజా చిత్రంలో కాస్త ట్రిమ్‌గా మారి, తన మేకోవర్‌తో పాటు, అంతకు ముందు చిత్రాల్లో కంటే ఇందులో కొంచెం నటన పరంగా కూడా ఇంప్రూవ్ అయినట్లు టీజర్ లలో తెలుస్తుంది. కాగా ఈ చిత్రం ఆగష్టు5న విడుదలకు సిద్దమవుతోంది. జూలై 31న ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నాడని సమాచారం. మరి ఈ చిత్రంతోనైనా అల్లు శిరీష్‌కు గుర్తింపు వస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ