Advertisementt

మెగాస్టార్‌ 150 బిజినెస్ కి మంచి క్రేజ్..!

Wed 27th Jul 2016 08:14 PM
megastar chiranjeevi,150th business craze,ram charan  మెగాస్టార్‌ 150 బిజినెస్ కి మంచి క్రేజ్..!
మెగాస్టార్‌ 150 బిజినెస్ కి మంచి క్రేజ్..!
Advertisement
Ads by CJ

సీనియర్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'కబాలి' చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను బద్దలు చేస్తోంది. ఇక రజనీకి సమంగా తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవికి కూడా అంతే స్టామినా ఉందని మెగాభిమానులు అంటున్నారు. 9ఏళ్ల గ్యాప్‌ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడం, తమిళ సూపర్‌హిట్‌ 'కత్తి'కి రీమేక్‌ కావడంతో తమ హీరో చిత్రం కూడా విడుదల సమయానికి 'కబాలి'లాగే భారీ అంచనాలను క్రియేట్‌ చేయడం ఖాయం అంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని స్వయంగా చిరంజీవి తనయుడు మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మిస్తుండటంతో తమకు నష్టాలు వచ్చినా రామ్‌చరణ్‌ ఏదో విధంగా తమను ఒడ్డున పడేస్తాడనే నమ్మకంతో కొందరు చిరు చిత్రాన్ని ఫ్యాన్సీ రేట్లకు సొంతం చేసుకుంటున్నారు. ఈ చిత్రం సీడెడ్‌ రైట్స్‌ను మెగాఫ్యామిలీకి అత్యంత ఆప్తుడైన ఎన్వీప్రసాద్‌ భారీ రేటుకు సొంతం చేసుకున్నాడట. ఇక ఈస్ట్‌, వెస్ట్‌గోదావరి జిల్లాలో కూడా ఫ్యాన్సీ రేట్లు లభించాయని అంటున్నారు. వైజాగ్‌ రైట్స్‌ కోసం రెండు సంస్దలు బాగా పోటీపడుతున్నాయి. కాగా చిరు చిత్రం విడుదలకు ముందే అంటే ప్రీరిలీజ్‌ బిజినెస్‌ 70కోట్లు దాటుతుందని ట్రేడ్‌వర్గాలు పేర్కొంటున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ