Advertisementt

'రోబో' రికార్డును..'కబాలి'తో తిరగరాశాడు!

Wed 27th Jul 2016 05:00 PM
kabali,robot,kabali beats robo at bollywood,rajinikanth  'రోబో' రికార్డును..'కబాలి'తో తిరగరాశాడు!
'రోబో' రికార్డును..'కబాలి'తో తిరగరాశాడు!
Advertisement
Ads by CJ

'కబాలి' చిత్రానికి మొదటి షో నుండే నెగటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లపరంగా మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లోనే కాదు... హిందీలో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తోంది. హిందీలో మొదటిరోజు కేవలం 5కోట్లు వసూలు చేసిన 'కబాలి', శని, ఆది వారాల్లో పుంజుకొని వీకెండ్‌ సమయానికి 20 కోట్లు వసూలు చేసింది. కాగా ఇటీవల కాలంలోనే కాదు.. సౌతిండియన్‌ చరిత్రలోనే సౌత్‌ఇండియా నుంచి హిందీలోకి డబ్‌ అయిన చిత్రాల కలెక్షన్లలో మొదటి స్దానంలో 'బాహుబలి' ఉంది. ఈ చిత్రం హిందీలో దాదాపు 120కోట్లు వసూలు చేసింది. ఇక రెండో స్దానంలో రజనీ-శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' చిత్రం 18కోట్లు వసూలు చేసి రెండోస్దానంలో ఉంది. తాజాగా 'కబాలి' చిత్రం 20కోట్లు వసూలు చేయడంతో రజనీ తన 'రోబో' రికార్డును తానే 'కబాలి'తో తిరగరాశాడు. దటీజ్‌.. తలైవా..! 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ