Advertisementt

ఎట్టకేలకు అఖిల్ సినిమా పై క్లారిటీ!

Wed 27th Jul 2016 02:44 PM
nagarjuna,akhil,hanu raghavapudi,akhil second movie in hanu direction,anr birthday  ఎట్టకేలకు అఖిల్ సినిమా పై క్లారిటీ!
ఎట్టకేలకు అఖిల్ సినిమా పై క్లారిటీ!
Advertisement
Ads by CJ

అఖిల్ మొదటి సినిమా వచ్చి దాదాపు 10 నెలలు కావస్తున్నా అతని రెండో సినిమా మాత్రం ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. మొదటి సినిమా 'అఖిల్'.. వి.వి.వినాయక్ డైరెక్టన్ లో తెరకెక్కి అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇక రెండో సినిమాతో నైనా హిట్ కొట్టాలని అఖిల్ తండ్రి నాగార్జున పట్టుదలగా వున్నాడు. ఏదైనా ఒక సినిమా హిట్ అయ్యింది అంటే వెంటనే  ఆ సినిమా తీసిన దర్శకుడే అఖిల్ రెండో సినిమాని డైరెక్ట్ చేస్తాడనే వార్తలు ఎప్పటికప్పుడు హల్ చల్ చేశాయి. అసలా ప్రచారం జరగడానికి నాగార్జునే కారణం అట. ఒకసారి 'ఊపిరి' తో హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సినిమా ఉంటుందని, మరోసారి హను రాఘవ పూడి డైరెక్షన్ లో అని... ఇంకోసారి రెండు సినిమాల హిట్స్ తో 3 వ సినిమా 'జనతా గ్యారేజ్' తో వస్తున్న కొరటాల శివతో అనే ప్రచారం జోరుగా సాగిన నేపధ్యం లో ఇప్పుడు అఖిల్ సినిమాకి ఒక స్టోరీ సెట్ అయ్యిందని తెలుస్తోంది. ఇన్నిరోజులుగా నాగార్జున దేనికోసం అయితే ఎదురు చూశాడో అలాంటి ఒక స్టోరీ ఒక యంగ్ డైరెక్టర్  వినిపించాడని... ఆ స్క్రిప్ట్ నాగార్జునకు విపరీతంగా నచ్చడం తో అది ఒకే చేసాడని టాక్. ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు ముందు నుండి అనుకుంటున్న డైరెక్టరే.... అతనే హను రాఘవపూడి. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఆ కథ ఉంటుందని ఇది ఖచ్చితంగా అఖిల్ కి సెట్ అవుతుందని నాగార్జున, అఖిల్ లు.. నమ్మి ఈ సినిమాను చేస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమా కథ ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని సమాచారం. ఈ సినిమా ANR  బర్త్ డే ని పురస్కరించుకుని సెప్టెంబర్ 20 వ తేదీన లాంఛనం గా ప్రారంభం కానుందట. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ