Advertisementt

'కబాలి' తో సూర్య మేల్కొన్నాడు..!

Tue 26th Jul 2016 01:16 PM
kabali,suriya,rajinikanth,pa ranjith  'కబాలి' తో సూర్య మేల్కొన్నాడు..!
'కబాలి' తో సూర్య మేల్కొన్నాడు..!
Advertisement
Ads by CJ

కుర్ర దర్శకుడు రంజిత్‌ పా 'కబాలి' చిత్రానికి సూపర్ స్టార్ అవకాశం ఇవ్వడం... ఆ తర్వాత ఆయన విడుదల చేసిన రజనీ గెటప్‌ అద్బుతంగా ఉండటం, ట్రైలర్‌కు వచ్చిన భారీ స్పందన లభించడం చూసి రంజిత్‌పాను అద్భుతంగా మెచ్చుకున్నారు ప్రేక్షకులు, ఇక ఇతర హీరోలైతే రంజిత్‌తో చిత్రాలు చేయాలని ఉబలాటపడ్డారు. 'అట్టకత్తి, మద్రాస్‌' సినిమాలు సాధించిన విజయం చూసి ఏరికోరి ఆయనకు అవకాశం ఇచ్చాడు రజనీ. కానీ సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చిందని ప్రచారం జరుగుతున్నప్పటికి ఈ చిత్రానికి చాలా బ్యాడ్‌ రివ్యూలతోపాటు ఫ్యాన్స్‌లో కూడా నెగటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. రజనీ వంటి స్టార్‌ అవకాశం ఇస్తే రంజిత్‌ దానిని సద్వినియోగం చేసుకోలేదంటూ ఆయనపై ఫ్యాన్స్‌ ద్వజమెత్తుతున్నారు. కాగా 'కబాలి' విడుదలకు ముందే హీరో సూర్య ఈ చిత్ర దర్శకుడు రంజిత్‌పాతో తాను హీరోగా ఓ చిత్రం, అలాగే తన సోదరుడు కార్తి హీరోగా మరో చిత్రం చేయాలని భావించాడు. కానీ 'కబాలి' చూసిన తర్వాత సూర్య తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని తెలుస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ