Advertisementt

నాగ్ టైటిల్ నానికి కలిసొస్తుందా..!

Mon 25th Jul 2016 06:00 PM
nagarjuna,majnu movie,nani,virinchi varma,nani new movie title  నాగ్ టైటిల్ నానికి కలిసొస్తుందా..!
నాగ్ టైటిల్ నానికి కలిసొస్తుందా..!
Advertisement
Ads by CJ

వరుసగా 'ఎవడే సుబ్రహ్మణ్యం, భలేభలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీరప్రేమగాధ, జెంటిల్‌మన్‌' వంటి చిత్రాలతో సూపర్‌హిట్లు కొట్టిన నాని ప్రస్తుతం నేచురల్‌ స్టార్‌ గా పిలవబడుతున్నాడు. కాగా నాని ఇప్పుడు 'ఉయ్యాల జంపాల' ఫేమ్‌ విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రానికి 'మజ్ను' అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. ఈ చిత్రంలో నాని ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పాత్రను పోషిస్తున్నాడు. నాని సరసన అను ఇమ్మాన్యుయల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తానికి నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పిన 'మజ్ను' టైటిల్‌ను నాని వాడుకోంటూ ఉండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే విడుదల తేదీని కూడా ఈ చిత్ర యూనిట్‌ అప్పుడే డిసైడ్‌ చేసింది. సెప్టెంబర్‌ 17, ఈ చిత్రానికి విడుదల ముహూర్తంగా ఖరారు చేశారని సమాచారం. నాని స్టైల్‌ ఆఫ్‌ కామెడీతో ఈ చిత్రం ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ