Advertisementt

మెగాస్టార్‌ సినిమాకు స్పెషల్‌ హంగులు....!

Mon 25th Jul 2016 01:55 PM
chiranjeevi,v.v.vinayak,comedy role,entertainment,kathi movie,kattilantodu  మెగాస్టార్‌ సినిమాకు స్పెషల్‌ హంగులు....!
మెగాస్టార్‌ సినిమాకు స్పెషల్‌ హంగులు....!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి వినాయక్‌ దర్శకత్వంలో తమిళ 'కత్తి'కి రీమేక్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ 'కత్తి' సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ పాత్ర చాలా తక్కువ. ఈ చిత్రం సీరియస్‌ మూడ్‌తో సాగుతుంది. కానీ తెలుగులో మాత్రం ఈ చిత్రానికి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను రంగరిస్తున్నాడు దర్శకుడు వినాయక్‌. ఇందుకోసం ఈ చిత్రంలో అలీ, వెన్నెల కిషోర్‌తో పాటు సంపూర్ణేష్‌బాబు వంటి కమెడియన్లును తీసుకున్నాడు వినాయక్‌. ఈ చిత్రంలో చిరంజీవి చేసే నాయకుడు పాత్ర సీరియస్‌గా సాగుతుంది. కానీ దొంగ పాత్ర మాత్రం మాంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని సమాచారం. ఇక చిరుకు జోడుగా అలీ, వెన్నెల కిషోర్‌, సంపూర్ణేష్‌బాబులు ఉంటే ఇక ఆ కిక్కే వేరుగా ఉంటుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఓ సీరియస్‌ సబ్జెక్ట్‌కు మార్పులు చేర్పులు చేసి ఎంతగా కామెడీకి వినాయక్‌ పెద్ద పీట వేశాడో సినిమా విడుదలైతే కానీ తెలియదు.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ