అడల్ట్‌ కామెడీ చిత్రం చేస్తోన్న అవసరాల...!

Mon 25th Jul 2016 12:29 PM
srini avasarala,ashta chamma movie,adult movie,hunter movie,regina,important role  అడల్ట్‌ కామెడీ చిత్రం చేస్తోన్న అవసరాల...!
అడల్ట్‌ కామెడీ చిత్రం చేస్తోన్న అవసరాల...!

'అష్టాచెమ్మా'తో నటునిగా అవతారం ఎత్తి, 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకునిగా, నటునిగా కూడా మెప్పించాడు అవసరాల శ్రీనివాస్‌. అయితే ఆయన స్టార్స్‌ చిత్రాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు వస్తున్నా వాటిని కూడా చేసి మెప్పిస్తున్నాడు. 'నాన్నకు ప్రేమతో, జెంటిల్‌మన్' చిత్రాలనే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈయన ఓ అడల్డ్‌ కామెడీ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బాలీవుడ్‌లో 'హంటర్‌' అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రం త్వరలో తెలుగులో రీమేక్‌ కానుంది. ఈ చిత్రంలోని ఓ ప్రధానపాత్రలో అవసరాల శ్రీనివాస్‌ నటిస్తున్నాడు. నవీన్‌ అనే నూతన దర్శకుడి దర్వకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రాధికాఆప్టే పోషించిన పాత్రను రెజీనా పోషించనుంది. ఇందులో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటించనున్నారు. బాలీవుడ్‌లో ఈ చిత్రం పెద్ద వివాదమే సృష్టించింది. ఇందులో బూతు సీన్లు, డైలాగ్‌లు మోతాదు మించాయని తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పటికీ సెన్సార్‌ ఈ చిత్రంలోని చాలా సీన్లు, డైలాగ్‌లను కత్తిరించింది. అయినప్పటికీ ఈ చిత్రం మోతాదు మించి ఉండటంతో విమర్శలను మూటగట్టుకుంది. మరి ఈ చిత్రం తెలుగులో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచిచూడాల్సివుంది.