Advertisementt

ఈ హీరోయిన్ నటించడం భర్త కి ఇష్టం లేదా?

Sun 24th Jul 2016 02:36 PM
amala paul,vijay,marriage life,amalapaul acting,vijay and amalapaul disturbed  ఈ హీరోయిన్ నటించడం భర్త కి ఇష్టం లేదా?
ఈ హీరోయిన్ నటించడం భర్త కి ఇష్టం లేదా?
Advertisement
Ads by CJ

హీరోయిన్ అమలాపాల్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా కూడా తన నటనతో తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకుంది. అటు తమిళంలోనే కాక ఇటు తెలుగులో ఇంకా మలయాళం లో కూడా పెద్ద హీరోలతో నటించింది. కానీ అనుకున్నంత అవకాశాలు ఆమె తలుపు తట్టలేదు. అయితే ఆమె నటనకు మాత్రం కొన్ని ఉత్తమ అవార్డ్స్ ఆమెను వరించాయి. అయితే సినిమాలలో నటిస్తుండగానే డైరెక్టర్ విజయ్ తో ప్రేమలో పడింది అమలాపాల్. కొంత కాలానికి ఆమె విజయ్ ని పెళ్లి చేసుకోవడంతో ఇక సినిమాలకు టాటా చెప్పేసిందని అనుకున్నారంతా. పెళ్ళైన తరువాత హనీమూన్ కి వెళ్లొచ్చాక మళ్ళీ నటించడం మొదలు పెట్టింది. ఆమె నటించడం వలన తన భర్త విజయ్ కి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. పెళ్ళైన తరువాత ఆమె సూర్య తో తమిళం లో పసంగా - 2 లో నటించి ఆ సినిమాతో హిట్ కొట్టింది. ఆ తర్వాత ధనుష్ తో ఒక సినిమాలో జంటగా నటిస్తుంది.  అయితే అసలు అమల భర్త విజయ్ కి ఆమె పెళ్లి తర్వాత నటించడం ఇష్టం లేదని.. అందుకే వారు తరుచూ గొడవలు పడుతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అసలు మీడియా కి ఈ డౌట్ రావడానికి కారణం కూడా ఉందట. పెళ్లికాక ముందు, పెళ్ళైన తర్వాత కూడా వీరు ఎక్కడికి వెళ్లాలన్నా జంటగా కలిసి వెళ్లే వారంట. కానీ వారు ఇప్పుడు ఎక్కడా జంటగా కనబడటం లేదంట. కనీసం అమల పాల్ సినిమా ప్రమోషన్స్ లో కూడా అమలకు తోడుగా ఆమె భర్త రావడం లేదని అందుకే వీరి వైవాహిక జీవితం లో ఎదో జరిగింది కాబట్టే ఇలా ఎడ మొహం పెడ మొహం గా వుంటున్నారని మీడియా ప్రచారం చేస్తుంది. అయితే ఈ విషయం పై అటు అమల పాల్ గాని ఇటు విజయ్ గాని స్పందిస్తే తప్ప ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడేలాలేదు.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ