Advertisementt

ప్రకాష్‌రాజు కి పబ్లిసిటీ వద్దా..?!

Sat 23rd Jul 2016 06:04 PM
prakash raju,publicity,mana oori ramayanam,no publicity  ప్రకాష్‌రాజు కి పబ్లిసిటీ వద్దా..?!
ప్రకాష్‌రాజు కి పబ్లిసిటీ వద్దా..?!
Advertisement
Ads by CJ

విలక్షణ నటునిగానే కాదు.. అభిరుచి ఉన్న నిర్మాతగా, దర్శకునిగా కూడా ప్రకాష్‌రాజ్‌కు మంచి పేరుంది. 'ఆకాశమంత, ధోని, ఉలవచారు బిర్యాని, గౌరవం' వంటి అభిరుచి ఉన్న చిత్రాలను తీసిన ఆయన ప్రస్తుతం 'మన ఊరి రామాయణం' అనే కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాను తీస్తున్నాడు. కాగా ఈచిత్రం టైటిల్‌తో కూడిన లోగోను మాత్రమే ఇప్పటివరకు విడుదల చేశాడు. కానీ విషయానికి వస్తే ఈ చిత్రం షూటింగ్‌ కూడా పూర్తయిపోయిందని, పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని సెన్సార్‌కు వెళ్లనుందని తెలుస్తోంది. అసలే పెద్ద పెద్ద స్టార్స్‌ కూడా ఇప్పుడు పబ్లిసిటీ లేనిదే సినిమాలకు హైప్‌ రాదని తెలిసి మీడియా ముందుకు వస్తున్నారు. కానీ చెప్పుకోతగ్గ ఆర్టిస్ట్‌లు కూడా లేని ఈ 'మన ఊరి రామాయణం' చిత్రానికి ఇప్పటివరకు ఎలాంటి పబ్లిసిటీ చేయకపోవడం, అసలు సినిమా అప్‌డేట్స్‌ కూడా తెలియకుండా సైలెన్స్‌గా సినిమాను పూర్తి చేయడం చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. ప్రకాష్‌రాజ్‌ ఎంత అభిరుచిగల చిత్రాలు తీస్తాడో ఓ వర్గం ప్రేక్షకులకు తెలిసినప్పటికీ ఇలా పబ్లిసిటీ లేకపోతే ఈ చిత్రానికి ఓపెనింగ్స్‌ ఎలా వస్తాయని? ట్రేడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ప్రకాష్‌రాజ్‌ వాస్తవాలు తెలుసుకొని పబ్లిసిటీపై దృష్టి సారించకపోతే ఈ చిత్రం బిజినెస్‌ కూడా జరిగే అవకాశం ఉండదని ట్రేడ్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ