ఎన్టీఆర్‌ వల్ల 300 కోట్ల బిజినెస్‌..!

Tue 19th Jul 2016 07:03 PM
jr ntr,300 crores business,ntr janatha garage,janatha garage release date postponed  ఎన్టీఆర్‌ వల్ల 300 కోట్ల బిజినెస్‌..!
ఎన్టీఆర్‌ వల్ల 300 కోట్ల బిజినెస్‌..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌లు కలిసి నటిస్తున్న 'జనతాగ్యారేజ్‌' చిత్రం ఆగష్టు12న విడుదలవుతుందని భావించిన ఎందరో నిర్మాతలు తమ చిత్రాలను ఎప్పుడు రిలీజ్‌ చేయాలా? అనే సందిగ్దంలో పడిపోయారు. రజనీకాంత్‌ 'కబాలి', వెంకటేష్‌ 'బాబు బంగారం' చిత్రాల నిర్మాతలు కూడా బాగానే టెన్షన్ పడ్డారు. గుడ్‌ ఓపెనర్‌గా క్రేజున్న ఎన్టీఆర్‌తో పోటీకి పోకూడదని భావించారు. కానీ చిత్రాన్ని సెప్టెంబర్‌2వ తేదీకి వాయిదా వేసినట్లు డైరెక్టర్‌ కొరటాల శివ నుంచి న్యూస్‌ రాగానే దాదాపు అరడజను చిత్రాల నిర్మాతలు తమ చిత్రాలకు విడుదలకు ముహూర్తాలు ఫిక్స్‌ చేసుకున్నారు. దాదాపు 300కోట్ల బిజినెస్‌కు ఎన్టీఆర్‌ దారి ఇచ్చాడు. జూలై 22న 'కబాలి', జూలై 29న సునీల్‌ 'జక్కన్న', ఆగష్టు5న చంద్రశేఖర్‌యేలేటి, మోహన్‌లాల్‌ల 'మనమంతా', అల్లుశిరీష్‌ 'శ్రీరస్తు.. శుభమస్తు', ఆది 'చుట్టాలబ్బాయ్‌', ఆగష్టు12 'బాబు బంగారం', ఆగష్టు 13న సాయిదరమ్‌తేజ్‌ 'తిక్క', ఇక ఇదే నెలలో నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' వంటి చిత్రాలకు లైన్‌ క్లియరైంది. మొత్తానికి ఎన్టీఆర్‌ 'జనతాగ్యారేజ్‌' ఇన్ని చిత్రాల విడుదలకు లైన్‌ క్లియర్‌ చేసినట్లు అయింది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ