Advertisementt

హిట్టు ఇచ్చినా..ఈ దర్శకులకి అవకాశాల్లేవ్!

Tue 19th Jul 2016 05:11 PM
merlapaka gandhi,aditya sriram,kranthi madav,sriwas,hit directors,no chances  హిట్టు ఇచ్చినా..ఈ దర్శకులకి అవకాశాల్లేవ్!
హిట్టు ఇచ్చినా..ఈ దర్శకులకి అవకాశాల్లేవ్!
Advertisement
Ads by CJ

కొందరు దర్శకులు హిట్లు ఇచ్చినా కూడా వారికి అవకాశాలు రావు. నిర్మాతల చుట్టూ తిరిగే రకాలు కాకపోవడం, ఇతర దర్శకుల మాదిరి భజన బృందాలు కాకపోవడమే దీనికి కారణమని ఇండస్ట్రీలో అంటూ ఉంటారు. కాగా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'లతో రెండు హిట్లు కొట్టిన మేర్లపాక గాందీకి ఇప్పటివరకు మరో చిత్రం లేకపోవడం గమనార్హం. ఇక దర్శకుడు శ్రీవాస్‌ తదుపరి చిత్రం గోపీచంద్‌తో ఉంటుందని తెలుస్తున్నా కూడా అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్ధితి. 'భలే మంచిరోజు'తో మంచి దర్శకునిగా పేరుతెచ్చుకున్న దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్యది కూడా ఇదే బాధ, ఇక 'ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' వంటి సృజనాత్మక చిత్రాల దర్శకుడు క్రాంతిమాధవ్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. వెంకటేష్‌తో సినిమా ఉంటుందనే ప్రచారం జరిగినా ఏ విషయం సెటిల్‌ కాకపోవడంతో ఈ దర్శకుడు కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ