Advertisementt

'కబాలి' కన్ఫర్మ్ అయినట్లే..!!

Sun 17th Jul 2016 01:38 PM
kabali,kabali censor talk,rajinikanth,kabali release details  'కబాలి' కన్ఫర్మ్ అయినట్లే..!!
'కబాలి' కన్ఫర్మ్ అయినట్లే..!!
Advertisement
Ads by CJ

అసలు అనుకున్న టైమ్‌కి విడుదల అవుతుందా? లేదా..? అనే సందేహం నుండి పక్కాగా జూలై 22న విడుదల అయ్యేందుకు 'కబాలి' రెడీ అవుతోంది. తాజాగా తెలుగుకి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తవ్వడంతో..జూలై 22 'కబాలి' విడుదల ఖాయమైనట్లే. సెన్సార్‌ సభ్యుల నుండి క్లీన్‌ 'యూ' సర్టిఫికెట్‌ తో పాటు మంచి ఫీడ్‌బ్యాక్‌ పొందినట్లుగా వార్తలు వస్తున్న ఈ మూవీ..బాక్సాఫీస్‌ వద్ద ఎటువంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుందో తెలియదు కానీ..ప్రస్తుతానికి మాత్రం జూలై 22న రిలీజ్‌కి 'కబాలి' రెడీ అనే విధంగా సెన్సార్‌ సూచనలు అందించినట్లయింది. 

మొదటి నుండి డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో వివాదాలు జరగడంతో తెలుగులో అసలు ఈ సినిమా అనుకున్న టైమ్‌కి రావడం కష్టమే అని అంతటా వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారంతో తెలుగు ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5000 కు పైగా స్క్రీన్లలో ఈ మూవీ విడుదల అవుతున్నట్లుగా తెలుస్తుంది. రజినీకాంత్‌ సరసన రాధికాఆప్టే, ధన్సిక మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి పా. రంజిత్‌ దర్శకుడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ