Advertisementt

'కబాలి' మూవీ లీక్..నిర్మాత అప్రమత్తం!

Thu 14th Jul 2016 08:24 PM
rajinkanth,kabali,full movie leaked,kalaipuli s thanu,attarintiki daaredi,sultan  'కబాలి' మూవీ లీక్..నిర్మాత అప్రమత్తం!
'కబాలి' మూవీ లీక్..నిర్మాత అప్రమత్తం!
Advertisement
Ads by CJ

ఎటువంటి సినిమా అయినా విడుదల అయిన కొన్ని గంటలకే పైరసీ రూపం లో బయటికొచ్చేస్తుంది. ఎంతో కష్టపడి నిర్మాతలు, దర్శకులు సినిమాలను తెరకెక్కిస్తుంటే విడుదలకు ముందు, విడుదలైన తరువాత ఈ పైరసీ భూతం వెంటాడుతోంది. అసలు ఈ పైరసీ మీద ఎంతమంది ఫైట్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ మధ్య పవన్ నటించిన 'అత్తారింటికి దారేది' విడుదలకు ముందే లీకై యూట్యూబ్ లో దర్శనమిచ్చింది. నిర్మాతలు కంగారు పడి ఆ సినిమాను వెంటనే విడుదల చేశారు. అయితే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యి పైరసీ అయినా నిర్మాతలు సేఫ్ అయ్యారు. మరి ఇంకా చాలా సినిమాలకు ఈ పైరసీ భూతం చుక్కలు చూపిస్తోంది. నిన్నగాక మొన్న 'ఉడ్తా పంజాబ్ , సుల్తాన్' వంటి సినిమాలను కూడా ఈ పైరసీ భూతం పట్టి పీడించింది. అసలీ సోదంతా ఎందుకు అనుకుంటున్నారా. అదే రజినీకాంత్ తాజాగా నటించిన 'కబాలి' కూడా లీక్ అయ్యిందని అంటున్నారు. ఈ సినిమాను నిర్మాత కలైపులి దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జులై  22 న సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఈ లీక్ విషయం నిర్మాతను కంగారు పుట్టించింది. సినిమా మొత్తం ఆన్ లైన్ లో లీకైందని ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన నిర్మాత కలైపులి చెన్నై హైకోర్టు ను ఆశ్రయించారని సమాచారం. అయితే దాదాపు 180 సైట్ ల్లో తాము ఈ లింక్ ని గుర్తించామని... వెంటనే అవి స్ప్రెడ్ కాకుండా ఆపాలని... అలాగే ఆ సైట్ లో నుంచి లింక్స్ తొలిగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టుని వేడుకున్నారు. మరి 'కబాలి' వంటి పెద్ద సినిమాల పరిస్థితే ఇలా ఉంటే చిన్న సినిమాల పరిస్థితి ఏమిటో కదా పాపం..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ